వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్యసభ సవరణ: జైల్లో ఉన్నా ఎన్నికల బరిలో దిగొచ్చు

By Srinivas
|
Google Oneindia TeluguNews

RS adopts bill to allow those in jail to contest polls
న్యూఢిల్లీ: జైలులో ఉన్న వారికి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉండదన్న సుప్రీం కోర్టు ఆదేశాలను పక్కనపెట్టి.. ప్రజాప్రాతినిథ్య చట్టంలో సవరణలను రాజ్యసభ మంగళవారం ఆమోదించింది. తద్వారా సుప్రీం కోర్టు ఆదేశాన్ని సర్కారు తిరగరాసింది. నేరారోపణలతో విచారణ ఎదుర్కొంటూ జైల్లో ఉన్న రాజకీయ నాయకులకు ఎన్నికల్లో పోటీచేసే హక్కు ఉండదని గత జూలై 10న సుప్రీం స్పష్టం చేసింది.

అయితే ఒక్క సవరణతో న్యాయస్థానం ఆదేశాలను సర్కారు పక్కన పెట్టింది. ఈ మేరకు ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరిస్తూ న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్ ప్రవేశ పెట్టిన ప్రతిపాదనలను రాజ్యసభ మంగళవారం ఆమోదించింది. పైగా ఇది పార్లమెంటు ఆమోదం పొందాక తీర్పు వెలువడిన రోజు నుంచే అమల్లోకి వచ్చినట్లు పరిగణించాలని సవరణలో పేర్కొంది. ఈ సందర్భంగా రాజకీయ నాయకులంతా నేరగాళ్లని రుజువు చేసేందుకు కోర్టులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయని మంత్రి వ్యాఖ్యానించారు.

చట్ట సవరణ ప్రకారం జైలు పక్షులు ఇకపై పోటీ చేయవచ్చునని తెలిపారు. ఈ హక్కును నిరాకరిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు పూర్తిగా తప్పేనన్నారు. దేశ రాజకీయాలపై ప్రభావం చూపే ఆదేశాలిచ్చే ముందు న్యాయవ్యవస్థ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. రాజకీయ నాయకులంతా నేరగాళ్లేనన్నది దేశ ప్రజల్లోని సహజ ప్రతికూల భావన అని, మనం అలాంటివాళ్లం కాకపోయినా, కోర్టులు మాత్రం ఇది నిజమేనని రుజువు చేసేందుకు అత్యుత్సాహం చూపుతున్నాయన్నారు.

'ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 62 కింద ఉప విభాగం(2) ప్రకారం అభియోగాలపై జైల్లో ఉన్న వ్యక్తికి ఓటు హక్కు ఉండదు. ఇది తాత్కాలికమే అయినప్పటికీ, ఓటరు కాని వ్యక్తి పోటీకి అర్హుడు కాడ'న్నది తీర్పు సారాంశం. దీనిపై ప్రభుత్వం సమీక్ష పిటిషన్ కూడా వేసింది. కానీ, దానిపై విచారణ పూర్తి కాలేదు. అంతలోనే సవరణను ఎగువసభలో ఆమోదించారు. ఈ మేరకు అభియోగాలు రుజువై శిక్ష విధిస్తూ తీర్పు వచ్చేదాకా ఓటు హక్కుకు భంగం కలగని విధంగా చట్టానికి సవరణ చేశారు.

English summary
Taking a step towards negating a Supreme Court order, RajyaSabha on Tuesday approved a proposal to maintain the right of those in jail to contest polls amidst law minister KapilSibal's contention that courts are "enthusiastic" to prove politicians as criminals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X