వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డ్యాన్స్ బార్‌లో పట్టుబడిన ఉత్తరప్రదేశ్ ఎస్పీ ఎమ్మెల్యే

By Pratap
|
Google Oneindia TeluguNews

పంజిమ్: ఉత్తరప్రదేశ్ అధికార సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) శాసనసభ్యుడు మహేంద్ర కుమార్ సింగ్ గోవాలోని ఓ వైల్డ్ పార్టీలో పోలీసులకు పట్టుబడ్డాడు. ఆయనను గత రాత్రి పోలీసులు వ్యభిచార నిరోధ చట్టం కింద అరెస్టు చేశారు. పంజిమ్‌లోని అక్రమ డ్యాన్స్ బార్‌లో ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌ ఎమ్మెల్యే సింగ్‌తో పాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

అరెస్టయిన ఐదుగురిలో మరో ఇద్దరు కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారే. ఆరు రోజుల పాటు వారిని పోలీసు కస్టడీకి అప్పగించారు. చెవులు చిల్లులు పడే శబ్దంతో పాటు మహిళల శబ్దాలు వినిపిస్తుండంతో పోలీసులకు ఫిర్యాదులు వెళ్లాయి.

Mahendra Kumar Singh

ఆ ఫిర్యాదులతో పోలీసులు అర్థరాత్రి దాటిన తర్వాత ఒంటి గంటన్నర ప్రాంతంలో దాడి చేశారు. పంజాబ్, ఢిల్లీ, ముంబై, ఉత్తరప్రదేశ్, చత్తీస్‌గడ్‌కు చెందిన ఆరుగురు సెక్స్ వర్కర్లకు పోలీసులు పార్టీ నుంచి విముక్తి కలిగించారు. అరెస్టు చేసిన చాలా సేపటికి గాని మహేంద్ర కుమార్ సింగ్ ఎమ్మెల్యే అనే విషయం పోలీసులకు తెలియలేదు.

విచారణ సందర్భంగా అతను ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే అని తెలిసి ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ధ్రువీకరించుకున్నారు. సింగ్ అరెస్టు గురించి ఉత్తరప్రదేశ్ స్పీకర్‌కు పోలీసులు సమాచారం అందించారు. తమ ప్రభుత్వం డ్యాన్స్ బార్లకు వ్యతిరేకమని గోవా ముఖ్యమంత్రి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో చెప్పారు.

English summary
A wild party in Goa turned out to be costly for a Samajwadi Party legislator Mahendra Kumar Singh, who was arrested late last night under the Anti-Prostitution law.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X