హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దీక్ష: క్షీణిస్తున్న జగన్ ఆరోగ్యం, అధికారుల ప్రయత్నాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని లేదా రాష్ట్రాన్ని విభజించవద్దని డిమాండ్ చేస్తూ హైదరాబాదులోని చంచల్ గూడ జైలులో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం క్షీణిస్తోంది. జగన్‌కు గ్లూకోజ్ లెవల్స్ పడిపోయాయి.

జగన్ ఐదు రోజులుగా దీక్ష చేస్తున్నారు. గత ఆదివారం ఉదయం ఆరున్నర గంటలకు జగన్ తన దీక్షను ప్రారంభించారు. ఈ రోజుతో ఐదో రోజుకు చేరుకుంది. జైలు వైద్యులు రోజు ఆయనకు ఆరోగ్య పరీక్షలు జరుపుతున్నారు. సాయంత్రం ఆరు గంటలకు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తున్నారు.

ఐదు రోజులుగా దీక్ష చేస్తుండటంతో నిన్నటి వరకు జగన్ ఆరోగ్యం నిలకడగానే ఉంది. అయితే, ఈ రోజు షుగర్ లెవల్స్ పూర్తిగా పడిపోయినట్లు సమాచారం. సాయంత్రం అధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నారు. ఆయన వైద్యుల సంరక్షణలో ఉన్నారు.

ఆరోగ్యం క్షీణిస్తుండటంతో జైలు అధికారులు దీక్ష విరమించాల్సిందిగా జగన్‌ను కోరారు. అతను మాత్రం సున్నితంగా తిరస్కరించినట్లుగా సమాచారం. జగన్‌ను ఆసుపత్రికి తరలించకుండా జైలులోనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే జైలు అధికారులు జగన్ దీక్షను సిబిఐ కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు.

English summary

 The YSR Congress Party cheif YS Jaganmohan Reddy's glucose level low, who is doing fast in Chanchalguda jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X