బాలికపై బిటెక్ విద్యార్థి రేప్: మరో బాలికపై బాలుడి రేప్

Two girls raped
హైదరాబాద్: రాష్ట్రంలోని వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు బాలికలు, వికలాంగురాలైన ఓ వృద్ధురాలు అత్యాచారానికి గురయ్యారు. నిజామాబాద్‌లోని ఎల్లమ్మగుట్టలో ఐదేళ్ల బాలికపై బీటెక్ విద్యార్థి అజర్ (21) అత్యాచారం చేశాడు. మంగళవారం మధ్యాహ్నం అజర్ తన ఇంటి ఎదుట ఆడుకుంటున్న ఆ చిన్నారిని చాక్లెట్ ఇస్తానంటూ ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి దిగాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిని బుధవారం అరెస్టు చేసి నిర్భయ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

వరంగల్ కరీమాబాద్‌లో నాలుగేళ్ల బాలికపై 16 ఏళ్ల బాలుడు అత్యాచారం చేశాడు. చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నల్లగొండ జిల్లా సూర్యాపేట మండలం బాలెంల గ్రామంలో బుధవారం వికలాంగురాలైన 60 వృద్ధురాలిపై అదే గ్రామానికి చెందిన గంట నాగయ్య (45) అత్యాచారం చేయబోయాడు. మధ్యాహ్నంవేళ ఆమె బహిర్భూమికి వెళ్తుండగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు నాగయ్యను చితకబాది పోలీసులకు అప్పగించారు.

ఇదిలావుంటే, ప్రేమ వేధింపులతో శిరీష ఆత్మహత్యకు కారణమైన దినేష్ యాదవ్‌ను నిర్భయ చట్టం కింద అరెస్టు చేయాలంటూ బుధవారం కరీంనగర్ జిల్లా గంభీరావుపేట మండలం గోరంటాల గ్రామస్తులు ధర్నా చేశారు. తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో దినేష్ ఆమె నిశ్చితార్థాన్ని కూడా చెడగొట్టాడు. దీంతో శిరీష మంగళవారం కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. పోలీసుల తీరుపై భగ్గుమన్న గ్రామస్తులు దినేష్‌ను అరెస్టు చేసేవరకూ అతడి ఇంటిముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు.

కాగా, కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఆశ్రమ పాఠశాలలో బాలిక(9)పై జరిగిన అత్యాచారం కేసులో ప్రధాననిందితుడు వంటమనిషి రాజ్‌మహ్మద్‌తో పాటు వార్డెన్ ధనలక్ష్మి, హూజూరాబాద్ ఏఎస్‌డబ్ల్యూవో నతానియల్‌లను సస్పెండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+