సహాయంగా నిమ్స్‌కు భారతి: కోలుకుంటున్న జగన్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి సహాయంగా ఉండేందుకు ఆయన భార్య భారతిని కోర్టు అనుమతించడంతో ఆమె ఆదివారం ఉదయం నిమ్స్‌కు వచ్చారు. ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఆమెకు కోర్టు అనుమతించింది. దీంతో ఆమె ఉదయం ఆసుపత్రికి వచ్చారు. జగన్‌కు వైద్యులు ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నందు వల్ల ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది. నిన్నటి నుండి ఈ రోజు వరకు మూడు నాలుగు ఫ్లూయిడ్స్ ఎక్కించినట్లుగా తెలుస్తోంది. దీంతో అతను కోలుకుంటున్నారు.
మరోవైపు జగన్ దీక్ష భగ్నం చేసినా పోరు ఆగదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ అన్నారు. జనం కోసం జగన్ పోరాటం చేస్తారన్నారు. ప్రజలకు తోడుగా ఉంటానని జగన్ చెప్పమన్నారన్నారు. విభజన ద్వారా ఇరు ప్రాంతాలకు న్యాయం చేయకపోతే సమైక్యంగా ఉంచాలని ఆమె డిమాండ్ చేశారు.

కాగా, శనివారం జగన్ దీక్షను భగ్నం చేసిన విషయం తెలిసిందే. కోర్టు అనుమతితో నిమ్స్‌లో వైయస్ జగన్‌ను కలిసిన తర్వాత భారతి మీడియాతో మాట్లాడారు. వైయస్ జగన్ ఆరోగ్యం విషమిస్తుంటే తనకైతే భయమేసిందని వైయస్ భారతి వ్యాఖ్యానించారు. ఆరోగ్యం విషమిస్తుంటే భయం వేయడం లేదా అని తాను అడిగితే సమయం వచ్చినప్పుడు స్పందించాలి కదా అని జగన్ అన్నారని ఆమె తెలిపారు.
బలవంతంగా వైద్యులు జగన్‌కు ఫ్లూయిడ్స్ ఎక్కించారని, తాను చూడలేకపోయానని, జగన్ దీక్ష భగ్నమైనట్లేనని ఆమె అన్నారు. జగన్ రక్తనమూనాలను తీసుకున్నారని, పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆరోగ్యం గురించి తెలుస్తుందని ఆమె అన్నారు. షుగర్, బిపి, పల్స్ రేటు తగ్గిపోయాయని వైద్యులు చెప్పారని ఆమె అన్నారు.
రెండు మూడు రోజులు వైద్యులను జగన్‌ను తమ పర్యవేక్షణలో ఉంచుకోవచ్చునని ఆమె అన్నారు. జైలు అధికారుల ఆదేశాలను జగన్‌కు చూపించి బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించారని ఆమె చెప్పారు. వైయస్ జగన్‌తో తాను రాజకీయాల గురించి మాట్లాడలేదని స్పష్టం చేశారు. దీక్ష విరమించాలని తాము ఎంతగా చెప్పిన జగన్ వినలేదని ఆమె అన్నారు. వీల్ చైర్ పెట్టినా నిన్న తాను నడుస్తానని జగన్ అన్నారట అని, ఒక్క రోజులోనే ఎంతో తేడా వచ్చిందని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications