కోర్టులో నేరస్థుడిపైకి దూసుకెళ్లిన నిర్భయ సోదరుడు

అక్కడే ఉన్న కోర్టు సిబ్బంది అతడిని నిలువరించారు. ఘోరమైన నేరానికి పాల్పడిన వాడికి మూడేళ్ల జైలు శిక్ష చాలా చిన్నదని, అతడిని ఇక్కడే ఉరి తీయాలని కళ్ల నీళ్ల పర్యంతమైన నిర్భయ తమ్ముడు కోర్టు వెలుపల చెప్పాడు. తాను దోషి ముఖంలోకి చూస్తే ఏమాత్రం పశ్చాత్తాపం, బాధ, భయం కనబడలేదని, రేప్, రాబరీ, మర్డర్ కేసులో మూడేళ్ల జైలు శిక్ష పడడం అతి తక్కువ శిక్ష అని అతను వాపోయాడు.
పదహారేళ్లు దాటిన వాళ్లకి ఏది తప్పో, ఏది ఒప్పో తెలుస్తుందని, జువనైల్ హోంలోనే అతడు దారుణంగా ప్రవర్తించి బ్లేడుతో ఒకరిపై దాడి చేశాడని అతను అన్నాడు. ప్రతి నిమిషం, సెకెండ్ తన అక్క మరణం గుర్తొస్తోందని అతను తెలిపాడు. తన కళ్ల ఎదుటే తన సోదరి చనిపోయిందని కన్నీరు పెట్టాడు. న్యాయం కోసం పైకోర్టులకు వెళ్తామని చెప్పాడు.
కాగా, వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసులో మైనర్ నిందితుడు దోషిగా తేలిన విషయం తెలిసిందే. అత్యాచారం, హత్య అభియోగాల్లో అతన్ని కోర్టు దోషిగా తేల్చింది. వైద్య విద్యార్థినిపై కదులుతున్న బస్సులో అత్యాచారానికి పాల్పడిన ఆరుగురిలో ఓ మైనర్ బాలుడు కూడా ఉన్నాడు. అతనిపై కేసును బాలనేరస్థుల కోర్టు విచారించింది. మూడేళ్ల పాటు అతన్ని రిఫార్మ్ సెంటర్‌కు పంపుతూ కోర్టు తీర్పు వెలువరించింది.












Click it and Unblock the Notifications