టిడిపి అసభ్యత: పొన్నం, జగన్ దీక్ష బూటకం: సురేఖ

తెలుగుదేశం సభ్యులు సభలో ఘర్షణ వాతావరణం సృష్టించేందుకు ప్రయత్నాలు చేశారు. గుంటూరు జిల్లాలో తెలుగు ఆత్మగౌరవ యాత్ర చేస్తున్న బాబు ప్రశంసలు పొందేందుకు వారు అలా ప్రవర్తించాలని మండిపడ్డారు. అందుకే గుంటూరులో బాబు తమ ఎంపీలు సభలో పోరాడుతున్నారని చెప్పారన్నారు.
వారు అసభ్యకరంగా మాట్లడినా తాము సభలో సంయమనం పాటించామన్నారు. ఇందిరా గాంధీ మాస్కులతో వస్తే అది సరికాదని చెప్పామని, తమ పార్టీ విప్ సందీప్ దీక్షిత్ వారిని తిట్టలేదన్నారు. సీమాంధ్రలో ఆత్మగౌరవ యాత్ర చేపడుతున్న బాబుకు అరవయ్యేళ్లుగా తెలంగాణలో ప్రజలు రోడ్లపైకి రావడం కనిపించలేదా అని ప్రశ్నించారు. తెలుగు జాతి ఆత్మగౌరవం పేరుతో టిడిపి తెలంగాణపై దాడి చేస్తోందన్నారు.
జగన్ దీక్ష బూటకం: కొండా సురేఖ
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దీక్ష ఓ బూటకమని, జగన్ పార్టీ నాటకాల పార్టీ అని మాజీ మంత్రి కొండా సురేఖ వేరుగా మండిపడ్డారు. ఆ పార్టీ యూ టర్న్ తీసుకోవడం వల్లనే తెలంగాణలో భూస్థాపితమయిందన్నారు. దొంగ దీక్షలు, యాత్రలతో తెలంగాణను అడ్డుకోలేరన్నారు.
ఊడ్చేందుకే: గాలి
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో రాష్ట్రంలో దోచుకోగా మిగిలింది ఊడ్చేందుకే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల యాత్ర చేస్తున్నారని టిడిపి నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు మండిపడ్డారు. మంత్రి కొండ్రు మురళి సీమాంధ్ర ఉద్యమాన్ని కించపర్చేలా మాట్లాడారన్నారు. విజయమ్మ బైబిల్ చేత పట్టుకొని అసత్యాలు పలకడం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications