హరికృష్ణ వ్యాఖ్యలపై కెఈ: షర్మిల యాత్రపై రేవంత్ సెటైర్

హరికృష్ణ పార్టీ మారుతారని తాను చెప్పలేదన్నారు. తాను పదవుల కోసం ఆశపడే వ్యక్తిని కాదన్నారు. హరికృష్ణ తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో పాటే యాత్ర పెట్టి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కాగా, పిఏసి పదవుల కోసం కొందరు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్తామని అధిష్టానాన్ని హెచ్చరించారని హరి ఉదయం ఆరోపించారు.
జగన్ సమైక్య రాగం: రేవంత్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల చేపట్టిన యాత్రకు జగన్ బెయిల్ రాగం అని పేరు పెడితే బాగుండేదని టిడిపి నేత రేవంత్ రెడ్డి వేరుగా ఎద్దేవా చేశారు. తాము భవిష్యత్తులో కాంగ్రెసు పార్టీ కలవబోమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రమాణం చేసి చెప్పగలదా అని ప్రశ్నించారు. జగన్ బెయిల్ కోసమే షర్మిల యాత్ర చేస్తున్నారన్నారు.
తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్, ఉద్యోగ సంఘాల నేత శ్రీనివాస్ గౌడ్‌లరు రహస్యంగా ఢిల్లీకి ఎందుకు వెళ్లారో చెప్పాలని ప్రశ్నించారు. ఢిల్లీలో వారు ఎవరెవవరిని కలిశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ వెళ్లి వచ్చాక కోదండ తమ పార్టీ అధినేతను టార్గెట్ చేస్తున్నారన్నారు.
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ మూడంచెల భద్రతలో తెలంగాణ రాష్ట్ర సమితి చేరిపోయిందని ఎద్దేవా చేశారు. సోనియా గాంధీని వ్యతిరేకించని నేతలు తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తామని చెప్పడం శోచనీయమన్నారు.
బాబు ఎలా పర్యటిస్తున్నారు: వైయస్సార్ కాంగ్రెసు
తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు నాయుడు సీమాంధ్రలో ఎలా యాత్ర చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత శోభా నాగి రెడ్డి ప్రశ్నించారు. బాబు యాత్రను సమైక్యాంధ్ర జెఏసి అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెసు సమన్యాయం చేయక పోవడం వల్లనే తాము సమైక్యవాదం ఎత్తుకోవాల్సి వచ్చిందని కొణతాల రామకృష్ణ అన్నారు.












Click it and Unblock the Notifications