చంద్రబాబు యాత్ర: ఎర్రబెల్లి కొత్త పార్టీ వ్యాఖ్య

ఇది ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. ఆయన మాటల్లోని ఆంతర్యమేమిటని పార్టీలో చర్చ సాగుతోంది. ఎర్రబెల్లి వ్యాఖ్యలపై కొందరు గుర్రుమంటున్నారట. అయితే ఎర్రబెల్లి వ్యాఖ్యలను అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని మరికొందరు అంటున్నారు. గతంలోను ఎర్రబెల్లి తన వ్యాఖ్యలతో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ఇబ్బందులకు గురి చేశారని అంటున్నారు.
ఎర్రబెల్లి పార్టీ పెట్టినా ఆయన వైపు ఎవరు వెళ్లరని అంటున్నారు. తెలంగాణ ప్రజలు తెలుగుదేశం పార్టీని పూర్తిగా నమ్ముతున్నారని, చంద్రబాబు తెలంగాణకు వ్యతిరేకంగా తన తెలుగు జాతి ఆత్మగౌరవ యాత్రలో ఎక్కడా చెప్పడం లేదంటున్నారు. రెండు ప్రాంతాల్లో పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్న దృష్ట్యా సీమాంధ్రులకు న్యాయం కోరుతున్నారని చెప్పారు.
కాగా, చంద్రబాబు తన తెలుగు జాతి ఆత్మగౌరవ యాత్రలో మాట్లాడుతూ.. తాను ఎన్డీయో హయాంలో సమైక్యాంధ్రనే కోరుకున్నానని అయితే, ఆ తర్వాత తెలంగాణ ప్రాంతంలో సెంటిమెంట్ దృష్ట్యా అనుకూలంగా లేఖ ఇచ్చానని బాబు చెబుతున్నారు. విభజన అంశానికి బీజం వేసింది, అగ్గి రాజేసింది కాంగ్రెసు వారేనని ఆయన ఆరోపిస్తున్నారు. బాబు వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారితీశాయి. ఆయన యు టర్న్ తీసుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఎర్రబెల్లి కొత్త పార్టీ వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications