తెలంగాణపై యుద్ధమే, సిటీపై పెత్తనానికే: మందకృష్ణ

Manda Krishna Madiga
హైదరాబాద్: హైదరాబాద్‌పై అజమాయిషీ. పెత్తనం, అధికారం కోసం సీమాంధ్రులు ప్రయత్నిస్తున్నారని, హైదరాబాద్ సదస్సు పేరుతో తెలంగాణ ప్రజలపై యుద్ధం చేసేందుకు సిద్ధం అవుతున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. శాంతి దీక్షలు, నిరసన ర్యాలీలతో ఈ యుద్ధాన్ని అడ్డుకోలేమని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు 48 గంటల్లో మౌనం వీడి వీరోచితంగా పోరాడాలని, ఈ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

సమైక్యాంధ్రలో సమ్మె నుంచి విద్యా సంస్థలను మినహాయించాలంటూ ఈ నెల ఆరో తేదీన హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న 'అణగారిన వర్గాల సభ'కు మద్దతుగా 'తెలంగాణ యుద్ధభేరీ' పేరిట ఉస్మానియాలో సంఘీభావ ర్యాలీ మంగళవారం జరిగింది. ఆర్ట్స్ కళాశాల నుంచి ఎన్‌సీసీ గేటు వరకు సాగిన ఈ ర్యాలీని ఎంఎస్ఎఫ్' కో-ఆర్డినేటర్ వంగపల్లి శ్రీనివాస్ పర్యవేక్షించారు. 'ఏపీఎన్జీవోల సదస్సు'పై మందకృష్ణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

సీమాంధ్ర ఉద్యమం బూచీ చూపి హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేసే కుట్రలు చేస్తున్నారన్నారు. విభజన నిర్ణయం నిర్ణయం న్యాయబద్ధమైనదని భావించినప్పుడు రాజకీయ పార్టీలు(బీజేపీ, టీడీపీ, సీపీఐ) మౌనం వీడి ఆ విషయాన్ని వెల్లడించాలని డిమాండ్ చేశారు. సీమాంధ్రలోని 13 జిల్లాల్లో విభజనకు అనుకూలంగా ఉద్యమం చేస్తుంది కేవలం ఎమ్మార్పీఎస్ మాత్రమేనన్నారు.

'ఇంటికొక్కరు చొప్పున రండి. అనుమతి ఇవ్వకపోతే రోడ్డు మీదే మోహరిస్తాం' అన్న ఏపీఎన్జీఓ నేత అశోక్‌బాబు మాటల్లో భయంకరమైన దాడి వ్యూహం ఉందని చెప్పారు. దీన్ని ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన వ్యూహంపై బుధవారం ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థులతో చర్చిస్తామని చెప్పారు.

ఇదిలా ఉండగా, హైదరాబాద్‌లో ఏపీఎన్జీవోల సదస్సుకు అనుమతి ఇస్తే యుద్ధం సృష్టిస్తామని తెలంగాణ విద్యార్థి జేఏసీ నేతలు హెచ్చరించారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో 'హైదరాబాద్ సిర్ఫ్ హమారా' పేరుతో సదస్సు నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+