ఆత్మగౌరవ యాత్రలో బాబు 'సింహగర్జన'(పిక్చర్స్)
గుంటూరు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలుగు జాతి ఆత్మగౌరవ యాత్ర గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలుగు జాతికి అన్యాయం జరిగితే విజృంభిస్తానని, సింహగర్జన చేస్తానని కాంగ్రెసు పార్టీని హెచ్చరించారు.
ఎవరైనా సరే ప్రజల మనోభావాలకు అనుగుణంగానే ప్రవర్తించాలని, రాజకీయాల కోసం చిచ్చు పెట్టడం క్షమించరాని నేరమని, తెలుగుజాతి జోలికి వస్తే టిడిపి చూస్తూ ఊరుకోదని, అంతు చూసే వరకు పోరాడుతుందన్నారు. తెలుగుజాతికి ఎప్పుడూ విక్టరీనే అన్నారు.
మొన్న వస్తున్నా మీ కోసం పాదయాత్ర చేసినప్పుడు మీరంతా కష్టాల్లో ఉన్నారని అప్పుడు నేను విజయ సంకేతం చూపించలేదని, ఈ రోజు మీరు రోడ్డెక్కి పోరాడుతున్నారని అందుకే ఇప్పుడు విక్టరీ సింబల్ చూపిస్తున్నానని అన్నారు. అంతిమంగా తెలుగు జాతిదే విజయమన్నారు.
బాబు ఆత్మగౌరవ యాత్రకు జనం విశేషంగా స్పందిస్తున్నారు. ఇప్పటివరకు గురజాల, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో బస్సుయాత్ర కొనసాగగా మంగళవారం పెదకూరపాడు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. క్రోసూరు, అచ్చంపేట, పెదకూరపాడు గ్రామాల్లో జరిగిన బహిరంగ సభలకు వేలాది మంది ప్రజలు హాజరై చంద్రబాబుకు నీరాజనాలు పట్టారు.

మమేకం
గుంటూరు జిల్లాలో జరుగుతున్న తెలుగు జాతి ఆత్మగౌరవ యాత్రలో ప్రజలతో మాట్లాడుతున్న టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.

స్వాగతం
గుంటూరు జిల్లాలో తెలుగు జాతి ఆత్మగౌరవ యాత్ర చేస్తున్న తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు బొట్టు పెట్టి స్వాగతం పలుకుతున్న మహిళలు.

పుష్పగుచ్ఛం
గుంటూరు జిల్లాలో తెలుగు జాతి ఆత్మగౌరవ యాత్ర చేపడుతున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు పుష్పగుచ్ఛం ఇస్తున్న దృశ్యం.

జన సందోహం
గుంటూరు జిల్లాలో తెలుగు జాతి ఆత్మగౌరవ యాత్ర చేపడుతున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు యాత్రకు తరలి వచ్చిన జన సందోహం.

జన సందోహం 2
గుంటూరు జిల్లాలో తెలుగు జాతి ఆత్మగౌరవ యాత్ర చేపడుతున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు యాత్రకు తరలి వచ్చిన జన సందోహం.

మాట్లాడుతున్న బాబు
గుంటూరు జిల్లా తెలుగు జాతి ఆత్మగౌరవ యాత్రలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.

పసుపుమయం
గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన ఆత్మగౌరవ యాత్రలో ఓ నేత మాట్లాడుతుండగా చూస్తున్న అధినేత.

పసుపుమయం - జన సందోహం
గుంటూరు జిల్లాలో కొనసాగుతున్న తెలుగు జాతి ఆత్మగౌరవ యాత్రకు భారీగా తరలి వచ్చిన కార్యకర్తలను, అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతున్న బాబు.












Click it and Unblock the Notifications