శక్తి మిల్లే, వారే: జర్నలిస్ట్ కంటే ముందే యువతిపై రేప్

అయితే, అంతకుముందు జూలై 31న పందొమ్మిదేళ్ల యువతిపై అదే దుండగులు అత్యాచారానికి ఒడిగట్టారు. మొదట ఫిర్యాదు చేయని యువతి, ఇప్పుడు తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో ముగ్గురు నిందితులను గుర్తు పట్టింది.
పత్రిక ఫోటో గ్రాఫర్ లాగానే ఈ యువతి కూడా స్నేహితుడితో కలిసి రైలు పట్టాల మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఇద్దరు యువకులవారిని ఏదో తప్పు చేశారంటూ బెదిరించి మిల్లులోకి తీసుకు వెళ్లారు. అక్కడున్న ముగ్గురుతో కలిసి యువతి స్నేహితుడిని కట్టిపడేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
ఈ ఘటనతో భయపడిన యువతి ఇంటికి కూడా వెళ్లకుండా స్నేహితుడితో కలిసి ఛత్తీస్‌గఢ్ పారిపోయింది. ఫోటో గ్రాఫర్ అత్యాచారం వెలుగు చూశాక ఆమె ముంబై తిరిగి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటికే ఆమె తల్లిదండ్రులు తమ కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో యువతిని తల్లిదండ్రులకు అప్పగించారు. కాగా, ఈ నిందితుల బాధితులు మరికొంత మంది ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications