రెండుసార్లు గెలిపించారు, అన్యాయం చేయం: దిగ్విజయ్
న్యూఢిల్లీ: రెండుసార్లు కాంగ్రెసు పార్టీని గెలిపించిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి తాము అన్యాయం చేయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం ఉదయం ఢిల్లీలో దిగ్విజయ్‌ను కలిశారు.
ఈ సందర్భంగా డిగ్గీ మాట్లాడారు. ఎపిలో ప్రజలు రెండుసార్లు కాంగ్రెసు పార్టీని గెలిపించారన్నారు. అలాంటి రాష్ట్రానికి తాము అన్యాయం చేయమని చెప్పారు. ఆంధ్రా ప్రాంతానికి సరైన న్యాయం చేస్తామని దిగ్విజయ్ సింగ్ చెప్పారు.

కాగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, దిగ్విజయ్ సింగ్‌ల మధ్య రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు చర్చకు వచ్చినట్లుగా సమాచారం.
అదే సమయంలో కాంగ్రెసు పార్టీ విభజన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ ప్రక్రియను ఆలస్యం చేయవచ్చునని కిరణ్ సూచించినట్లుగా తెలుస్తోంది. ఎన్నికల తర్వాత ప్రక్రియ పూర్తి చేయవచ్చునని డిగ్గీగి సూచించారని సమాచారం. విభజన తర్వాత ఎన్నికలకు వెళ్తే సీమాంధ్రలో పార్టీ తుడిచి పెట్టుకు పోవడం ఖాయమని కాబట్టి, ఎలాగు నిర్ణయం తీసుకున్నందున ఎన్నికల తర్వాత ప్రక్రియ పూర్తి చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారని వార్తలు వస్తున్నాయి.
కాగా, మంగళవారం రాత్రి ఎకె ఆంటోనితో భేటీ అయిన కిరణ్ కుమార్ రెడ్డి ఆయన ముందు మరోసారి సమైక్యవాదం వినిపించిన విషయం తెలిసిందే. ఈ రోజు కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేతో భేటీ అనంతరం ఆయన హైదరాబాదుకు తిరుగు ప్రయాణం కానున్నారు.












Click it and Unblock the Notifications