సాగర్‌లో సూసైడ్‌యత్నం: గర్ల్‌ని కాల్చి కాల్చుకున్నాడు

Hussain Sagar
హైదరాబాద్/లక్నో: ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాదులోని హుస్సేన్ సాగర్‌లో బుధవారం ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించగా, లేక్ పోలీసులు అతనిని రక్షించారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి నష్టపోవడం వల్లనే అతను ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ప్రాంతానికి చెందిన రమేష్ గాజులరామారంలోని ఓ అపార్టుమెంటులో ఉంటున్నాడు.

ప్రేమ పేరుతో అమ్మాయిపై కాల్పులు

ఉత్తర ప్రదేశ్‌లో ఓ యువకుడు పదిహేనేళ్ల బాలిక పైన తరగతి గదిలోనే కాల్పులు జరిపి, అనంతరం తాను కాల్చుకున్న సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో యువకుడు మృతి చెందగా, గాయాలతో బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అమేథీలో బాలిక తరగతి గదికి వెళ్లిన కాసేపటికే ఆమెకు బంధువు అయిన ఓ యువకుడు ఆమె కడుపులో కాల్పులు జరిపాడు.

తర్వాత తనను తాను తలకి గురిపెట్టి కాల్చుకున్నాడు. అతను అక్కడికక్కడ చనిపోగా బాలిక ఆసుపత్రిలో కోలుకుంటోంది. హంతకుడు తనని ప్రేమిస్తున్నానని వెంటబడుతున్నాడని, అతని దగ్గర రెండు తుపాకులు ఉన్నాయని, ప్లాస్టిక్ సంచిలో బుల్లెట్లు పెట్టుకొని తిరుగుతాడని బాలిక పోలీసులకు చెప్పినట్లు సమాచారం.

బాంబు కలకలం

మహారాష్ట్ర రాజధాని ముంబైలో బుధవారం బాంబు కలకలం చెలరేగింది. ముంబైలోని బెస్ట్ బస్‌లో గల ఆర్‌బిఐ ప్రధాన కార్యాలయం వద్ద ఉన్న సంచి ఈ కలకలం సృష్టించింది. సంచిలో బాంబు ఉందనే ఫోన్ కాల్ అందుకున్న బాంబు స్క్వాడ్ అక్కడకు పరుగులు తీశారు. సంచిని తనిఖీ చేయగా అందులో బట్టలు దొరికాయి. దీంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+