'జరగాల్సిన ప్రక్రియలో టి జరుగుతుందని ప్రధాని హామీ'

ఈ సందర్భంగా తెలంగాణ ప్రక్రియను ఆలస్యం చేసిన కొద్దీ ప్రతి ఒక్కరూ పరిస్థితుల్ని రాజకీయ లబ్ధికి పయోగించుకుంటున్నారని ప్రధాని దృష్టికి తెచ్చారు. సీమాంధ్ర నాయకులు తెలంగాణ ప్రక్రియ ఆగిపోతుందంటూ ప్రజలకు అవాస్తమైన హామీలు ఇస్తున్నారని తెలిపారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని తీవ్రంగా విమర్శిస్తున్నారని కాబట్టి ప్రక్రియ ఎంత త్వరగా మొదలు పెడితే అంత మంచిదని సూచించారు.
దీనికి ప్రధాని స్పందిస్తూ ప్రస్తుతం పార్లమెంటు జరుగుతోందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగాల్సిన క్రమంలో ముందుకు జరుగుతుందని వ్యాఖ్యానించినట్లు విహెచ్ చెప్పారు. ముఖ్యమంత్రి తీరుపై కూడా తాము ప్రధానికి ఫిర్యాదు చేశామని పొన్నం ప్రభాకర్ చెప్పారు.
రాష్ట్రాన్ని విభజిస్తూ కేంద్ర కేబినెట్ ముందుకు నోట్ వచ్చేలోగా తెలంగాణ జిల్లాల్లో విజయోత్సవాలు వేగవంతం చేయాలని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. బుధవారం నుంచి నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ సంబురాలను నిర్వహించేందుకు భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డి సిద్ధమయ్యారు.












Click it and Unblock the Notifications