హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సభకు టిక్కెట్స్ అమ్మకం, ఓయు విద్యార్థులు(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఈ నెల 7వ(శనివారం) తేదిన రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఎపిఎన్జీవోలు తలపెట్టిన సభ ఓ వైపు, వారి సభను అడ్డుకునేందుకు తెలంగాణవాదులు మరోవైపు పోటీ ర్యాలీలు, నిరసనలు, బందులకు పిలుపు ఇవ్వడంతో హైదరాబాదులో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. సభను నిర్వహించి తీరుతామని ఎపిఎన్జీవోలు, సమైక్యవాదులు చెబుతుండగా, అడ్డుకుంటామని తెలంగాణవాదులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. భారీ బలగాలను మోహరించారు. మరోవైపు సచివాలయంలో ఎపిఎన్జీవో సభ కోసం గురువారం టిక్కెట్లు విక్రయించారు. ఒక్కో టిక్కెట్ ధర పది రూపాయలు. వచ్చిన మొత్తాన్ని సమైక్యాంధ్ర ఉద్యమం కోసం వినియోగిస్తారు.

కాగా, విభజనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీరును నిరసిస్తూ తెలంగాణ విద్యార్థి పరిషత్(టిజివిపి) ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సిఎం దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. మరోవైపు, ఎపిఎన్జీవో సభ చట్ట విరుద్ధమని హైకోర్టులో వేసిన పిటిషన్ పైన విచారణ శుక్రవారానికి వాయిదా పడింది.

బిఎస్ఎఫ్ జవాన్లు

బిఎస్ఎఫ్ జవాన్లు

ఈ నెల 7వ తేదిన హైదరాబాదులో ఎపిఎన్జీవోల, తెలంగాణవాదుల బందు పిలుపు నేపథ్యంలో రాజధానిలో బిఎస్ఎఫ్ జవాన్లు వస్తున్న దృశ్యం.

సచివాలయంలో...

సచివాలయంలో...

ఈ నెల 7వ తేదిన హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ఎపిఎన్జీవోల సభ నేపథ్యంలో సచివాలయంలో టిక్కెట్స్ ఇస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ కూడా తమ నిరసనను తెలియజేస్తున్న సమైక్యవాదులు.

సచివాలయంలో...

సచివాలయంలో...

ఈ నెల 7వ తేదిన హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ఎపిఎన్జీవోల సభ నేపథ్యంలో సచివాలయంలో టిక్కెట్స్ ఇస్తున్నారు. టిక్కెట్స్ తీసుకుంటున్న దృశ్యం.

టిక్కెట్స్ డబ్బులు

టిక్కెట్స్ డబ్బులు

ఈ నెల 7వ తేదిన హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ఎపిఎన్జీవోల సభ నేపథ్యంలో సచివాలయంలో టిక్కెట్స్ ఇస్తున్నారు. టిక్కెట్స్ అమ్మగా వచ్చిన డబ్పులు. వీటిని సమైక్యాంధ్ర ఉద్యమం కోసం వినియోగిస్తారు.

అవిచ్ఛిన్న యజ్ఞానికై...

అవిచ్ఛిన్న యజ్ఞానికై...

ఈ నెల 7వ తేదిన హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ఎపిఎన్జీవోల సభ నేపథ్యంలో సచివాలయంలో టిక్కెట్స్ ఇస్తున్నారు. టిక్కెట్స్ అమ్మగా వచ్చిన డబ్పులు అవిచ్ఛిన్నాన యజ్ఞానికై అంటూ డబ్బాపై ఉన్న దృశ్యం.

సోనియా సమన్యాయం..

సోనియా సమన్యాయం..

సోనియా సమన్యాయం అంటూ... సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు ఆమె ప్లకార్డుతో నిరసన తెలియజేస్తున్న దృశ్యం. సీమాంధ్రకు తెలిసి సమన్యాయం సమైక్యాంధ్రే అని ప్లకార్డులో పేర్కొన్నారు.

ఉస్మానియాలో టిజివిపి

ఉస్మానియాలో టిజివిపి

విభజనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ తెలంగాణ విద్యార్థి పరిషత్(టిజివిపి) ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిరసన.

బిల్లు పెట్టండి

బిల్లు పెట్టండి

పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టి వెంటనే ఆమోదింపచేయాలని, హైదరాబాదుతో కూడిన పది జిల్లా తెలంగాణ ఇవ్వాలని ఉస్మానియా విశ్వవిద్యాలయ వర్సిటీ కాంట్రాక్టు ఉద్యోగుల ఆందోళన.

ఉస్మానియాలో టిజివిపి ర్యాలీ

ఉస్మానియాలో టిజివిపి ర్యాలీ

విభజనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ తెలంగాణ విద్యార్థి పరిషత్(టిజివిపి) ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిరసన ర్యాలీ.

పువ్వులు ఇచ్చి నిరసన

పువ్వులు ఇచ్చి నిరసన

రాష్ట్ర విభజనకు అందరూ సహకరించాలని కోరుతూ ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు పోలీసులకు పూలు ఇస్తున్న దృశ్యం.

దిష్టిబొమ్మ దగ్ధం

దిష్టిబొమ్మ దగ్ధం

విభజనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ తెలంగాణ విద్యార్థి పరిషత్(టిజివిపి) ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కమార్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేస్తున్న దృశ్యం.

English summary
Protest and effigy burning OF CM Kiran Kumar Reddy by TGVP students at Osmania University.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X