సమైక్యంలో చెర్రీ తుఫాన్: చిత్తూరులో మొదటి షాక్!
హైదరాబాద్/చిత్తూరు: సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ సినిమాల పైన పడుతున్నట్లుగా కనిపిస్తోంది. చిరంజీవి రాజ్యసభ సభ్యుడు కాకముందు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన చిత్తూరు జిల్లాలో చెర్రీ సినిమాపై ప్రభావం పడినట్లుగా కనిపిస్తోంది.
తిరుపతిలో రామ్ చరణ్ తేజ తాజా సినిమా తుఫాన్‌ను ప్రదర్శించవద్దని సమైక్యవాదులు థియేటర్ల యాజమాన్యాలను కోరారు. ప్రదర్శిస్తే మాత్రం అడ్డుకుంటామని చెప్పారు. దీంతో జిల్లాలోని పలమనేరు, చిత్తూరు తదితర ప్రాంతాల నుండి సినిమా ప్రదర్శనకు థియేటర్ యాజమాన్యాలు ముందుకు రాలేదని తెలుస్తోంది.

మంత్రులు ఇళ్ల ముట్టడి
కర్నూలులో కేంద్రమంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, రాష్ట్ర మంత్రి టిజి వెంకటేష్ ఇళ్లను విద్యుత్ ఉద్యోగులు గురువారం ముట్టడించారు. అంతకుముందు విద్యుత్ భవన్ నుంచి రాజ్ విహార్ కూడలి వరకు ఉద్యోగులు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు.
శ్రీకాకుళం జిల్లాలో సమైక్య నిరసనలు కొనసాగుతున్నాయి. 37వరోజు నిరసనలో భాగంగా గురువారం ఉదయం ఉపాధ్యాయులు భారీ ధర్నాలు, మానవహారాలు నిర్వహించారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, తెరాస అధ్యక్షుడు కెసిఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ డిమాండ్ చేశారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications