లక్షకోట్ల దొంగ, ఎలక్షన్స్: జగన్, కెసిఆర్‌లపై మోత్కుపల్లి

2014 వరకు తెలంగాణ రాకూడదన్నది కెసిఆర్ ఉద్దేశ్యమని, ఆ ఎన్నికలే ఆయన లక్ష్యమని మోత్కుపల్లి ఆరోపించారు. తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుకుంటున్నారని, కెసిఆర్ మళ్లీ ఇక్కడ రావణకాష్టం రగిలిస్తున్నారని, తన కుటుంబ లబ్ధఇ కోసమే తెలంగాణవాదాన్ని వాడుకుంటున్నారని ఆరోపించారు.
కాంగ్రెసు, తెరాస నాటకాల ఫలితంగా ఇప్పటికే చాలామంది తెలంగాణ ప్రజలు బలయ్యారన్నారు. కాంగ్రెసులో తెరాస విలీనంపై కెసిఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఆ విలీనం ఏదో త్వరగా చేస్తే తెలంగాణ వస్తుందన్నారు. కెసిఆర్ తెలంగాణ, సీమాంధ్ర ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు.
ఇరు ప్రాంతాల మధ్య తగవు పెట్టి కాంగ్రెసు పార్టీ తమాషా చూస్తోందన్నారు. తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసే నాటకాలకు కాంగ్రెసు పార్టీ తెరలేపుతోందన్నారు. దానిని ఎవరు సహించరన్నారు. విభజన చేసి ఇరు ప్రాంతాలకు న్యాయం చేయాలని టిడిపి డిమాండ్ చేస్తోందన్నారు.
రేపటి బందును తెరాస ఇస్తే తాము సహకరించమని, జెఏసి ఇస్తే మాత్రం వారు తమను సంప్రదిస్తే చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. జగన్‌కు ఆసుపత్రిలో అన్ని వసతులు కల్పించారని, లక్ష కోట్లు దండుకున్న దొంగ కూడా తాను పాలిస్తానని చెప్పడం విడ్డూరమన్నారు. దోపిడీ దొంగలకు ప్రజలు గుణపాఠం చెప్పాలని కోరారు.












Click it and Unblock the Notifications