ఎట్టకేలకు సీరియల్ రేపిస్టు జయశంకర్ అరెస్టు

అతని ఆచూకీ చెప్పినవారికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని పోలీసులు ప్రకటించారు. అదే అతన్ని పట్టిచ్చినట్లు సమాచారం. జైలు నుంచి పారిపోయిన తర్వాత అతని కోసం పోలీసులు లుకవుట్ నోటీస్ జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణపై 11 మంది జైలు అధికారులను సస్పెండ్ చేశారు.
36 జయశంకర్ మానసిక ఉన్మాది అని చెబుతున్నారు. తమిళనాడులోని సేలం జిల్లాలోని కన్యపట్టణం కోనసముద్ర గ్రామానికి చెందిన జయశంకర్‌కు అక్రమ చొరబాటు, అత్యాచారం, హత్య నేరాల కింద పదేళ్ల జైలు శిక్ష పడింది.
తమిళనాడులోని చెన్నై, ధర్మపురి, హోసూరు, సేలం, తిరుపత్తూరుల్లో, కర్ణాటకలోని బెంగళూర్ రూరల్, చిత్రదుర్గ, హిరియూరు, కడూరు, మోలకల్మూరు, తుంకూరుల్లో 20కి పైగా కేసుల్లో అతను విచారణను ఎదుర్కుంటున్నాడు.












Click it and Unblock the Notifications