రాష్ట్రాన్ని విడగొట్టలేరు, విడిగొట్టనివ్వం: మిత్రా వ్యాఖ్య

ఎన్నికల్లో గెలవలేని వారు ఎన్ని బింకాలకు పోయినా, వారి తాటాకు చప్పుల్లకు ప్రజలు భయపడరని హెచ్చరించారు. రాష్ట్రం కోసం నిజాయితీగా ఉన్నామన్న ఎంపీలు దమ్ముంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన ప్రక్రియ అయిపోయిందనడం అబద్దమన్నారు. పార్లమెంటు సభ్యులు రాజీనామా చేస్తేనే అప్పుడు ప్రక్రియ ఆగిపోతుందని ఆయన తెలిపారు.
తెలంగాణ, సీమాంధ్ర పదాలు వాడొద్దని, ఆంధ్రప్రదేశ్ మనందరిదని, దీనికి ఒకే ఒక్క రాజధాని హైదరాబాద్ అని మిత్రా అన్నారు. తమకు రక్షణ కావాలని ఎవరూ అడగలేదన్నారు. ఇంకొంత కాలమే పదవుల్లో ఉండే మీరు తమకు రక్షణ ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు. తమను తాము రక్షించుకోగలమని ఆయన అన్నారు.
ఎంపీలు, మంత్రులు ప్రజాప్రతినిధుల అంతా కలిసి అధిష్టానంపై ఒత్తిడి తీసుకువచ్చి రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని మిత్రా కోరారు. తమ లేఖల వల్లే విభజన నిర్ణయం జరిగిందని ప్రచారం చేసుకోవడం, యాత్రలు చేస్తున్నవారు వాటిన వదిలేసి జనం వెనుక, జనం ప్రక్కన,జనంతో నిలబడి పోరాడితే విభజన ప్రక్రియ ఆగిపోతుందన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ను విభజించడం అబధ్దమని, దీనికై ఎంత వరకైనా పోరాడుతామని మిత్రా తెలిపారు.












Click it and Unblock the Notifications