నోట్ రెడీ అవుతోంది, హైదరాబాద్‌పై మూడు: టీపై షిండే

న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన ప్రక్రియపై వెనక్కి తగ్గేది లేదని కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పకనే చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేబినెట్ నోట్ తయారవుతోందని, హోంశాఖ నోట్‌ను తయారు చేస్తోందని, సకాలంలో అది పూర్తవుతుందని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. సిడబ్ల్యుసి నిర్ణయం మేరకే కేబినెట్ నోట్ తయారవుతున్నట్లు తెలిపారు. ఎపి ఎన్జీవోల సభ పరిణామాలను పరిశీలిస్తున్నట్లు షిండే చెప్పారు

హైదరాబాద్‌పై ఒకటి, రెండు, మూడు ప్రతిపాదనలున్నాయని, ఏ ఒక్క ప్రతిపాదనకో పరిమితం కాలేదమని, హైదరాబాద్‌పై ఇప్పుడే నిర్ణయానికి రాలేమని ఆయన అన్నారు. హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతమవుతుందా, లేదా అనేది చెప్పలేనని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనపై కొత్త కొత్త ప్రతిపాదనలు వస్తున్నాయని, అందుకే కేబినెట్ నోట్ తయారీలో జాప్యం జరుగుతోందని షిండే అన్నారు. హైదరాబాదులో శాంతిభద్రతల సమస్య లేదని ఆయన అన్నారు.

Sushil kumar Shinde

సంప్రదింపులు జరిపిన తర్వాతనే రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకున్నామని, తాను కూడా అఖిల పక్ష సమావేశం నిర్వహించానని ఆయన చెప్పారు. రెండు పార్టీలు మాత్రమే రాష్ట్ర విభజనను వ్యతిరేకించాయని, అందులోనూ సిపిఎం మాత్రమే స్పష్టంగా సమైక్యానికి కట్టుబడి ఉందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తారనే వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు.

పార్టీ అధిష్టానం సూచన మేరకే రాష్ట్ర విభజనపై సిడబ్ల్యుసి నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు ఆంటోనీ కమిటీ అందరి సూచనలూ తీసుకుంటోందని, అది పార్టీ ఏర్పాటు చేసిన కమిటీ మాత్రమేనని, ఆ కమిటీ సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని ఆయన చెప్పారు. సిడబ్ల్యుసి నిర్ణయంతోనే తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభమైందని ఆయన చెప్పారు. విభజన తొలి దశ ప్రక్రియ పూర్తయిందని, రెండో దశ పనులు సాగుతున్నాయని ఆయన అన్నారు. నీరు, విద్య, ఉపాధి రంగాలకు సంబంధించిన అనుమానాలను కేబినెట్ నోట్ తీరుస్తుందని ఆయన చెప్పారు.

మహారాష్ట్రలోనే కాకుండా పలు రాష్ట్రాల్లో కొత్త రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్లు ఉన్నాయని, వాటిని ఇప్పుడు పరిశీలించలేమని, వాటిని తెలంగాణతో పోల్చలేమని ఆయన అన్నారు. ఘర్షణ పూరిత వైఖరి వల్ల సమస్యలు పరిష్కారం కావని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+