టీ కాంగ్రెసు నేతలు కుట్ర: డిగ్గీకి కెవిపి టీమ్ ఫిర్యాదు

ఎపిఎన్జీవోలు రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు అనుమతితో హైదరాబాద్‌లో శనివారం బహిరంగ సభ నిర్వహిస్తున్నారని, అయితే కొన్ని రాడికల్ శక్తులు, తెరాస నాయకులు, రాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన కొందరు నేతలు బహిరంగ సభను దెబ్బ తీసేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారని తమ లేఖలో ఆరోపించారు. ఎపిఎన్జీవోల బహిరంగ సభను దెబ్బ తీయకుండా చూసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
బహిరంగ సభను భగ్నం చేస్తామంటూ రాడికల్ శక్తులు ఇచ్చిన పిలుపునకు రాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన కొందరు మంత్రులు, ఎంపీలు మద్దతివ్వటం దురదృష్టకరమని సీమాంధ్ర ఎంపీలు దుయ్యబట్టారు. రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడే సీమాంధ్రుల సభలు నిర్వహించుకునే హక్కును హరిస్తున్న వీరు, రాష్ట్రం విడిపోయిన తరువాత సీమాంధ్రుల పట్ల ఎలా వ్యవహరిస్తారనేది సులభంగానే ఊహించుకోవచ్చునని ముగ్గురు ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన కొందరు నాయకులు ప్రజల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టటం సిగ్గుచేటని దుయ్యబట్టారు.
‘తెలంగాణవాలా జాగో, ఆంధ్రావాలా భాగో' అని గతంలో నినాదాలు ఇచ్చిన తెరాస నాయకులతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చేతులు కలుపుతున్నారని దిగ్విజయ్‌కు రాసిన లేఖలో ఆరోపించారు. కాంగ్రెస్ అధినాయకత్వం వెంటనే జోక్యం చేసుకుని ఎపిఎన్జీవోలు హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న బహిరంగ సభకు ఎలాటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని దిగ్విజయ్‌కు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications