ఇప్పుడే ఇలా ఉంటే..: షర్మిల, శోభా హైమావతి సవాల్

ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే, ఇక రాష్ట్రం విడిపోయాక హైదరాబాదులో సీమాంధ్రుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. గతంలో మద్రాసును తీసుకున్నారని, ఇప్పుడు సీమాంధ్రులకు హైదరాబాదును దూరం చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాదుపై సీమాంధ్రులకు హక్కు లేదంటే ఎలా అని ప్రశ్నించారు. 50 ఏళ్ల అభివృద్ధికి నిదర్శనం హైదరాబాద్ అని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వల్లనే విభజన జరిగిందని ఆరోపించారు.
షర్మిలకు శోభా హైమావతి సవాల్
విభజనపై తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై ఆరోపణలు చేస్తున్న షర్మిలకు తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు శోభా హైమావతి ప్రశ్నల వర్షం కురిపించారు. తాము భవిష్యత్తులో ఎప్పటికీ కాంగ్రెసు పార్టీలో కలవమని, కాంగ్రెసు పార్టీతో పొత్తు పెట్టుకోమని షర్మిల చెప్పగలరా అని ప్రశ్నించారు. హైదరాబాద్ అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు ఆ పార్టీకి ఉందా అన్నారు.
షర్మిలకు నిత్యం బాబు నామస్మరణే అని ఎద్దేవా చేశారు. ఇప్పటికే తెలంగాణ ప్రాంతంలో ఖాళీ అయిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పరిస్థితి సీమాంధ్రలోను అగమ్యగోచరంగా ఉందన్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు, రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలనుకోవడం సమంజసమా అని ప్రశ్నించారు. బయ్యారం గనులు, ఇడుపులపాయ అక్రమాలపై నోరు మెదపని నేతలు అబద్దాలు పలకడం మానుకోవాలన్నారు. తాము తెలంగాణకు వ్యతిరేకం కాదన్నారు.












Click it and Unblock the Notifications