చవితి పూజలు: కృష్ణా జిల్లాలో బాబు, కావలిలో షర్మిల
ఆత్మగౌరవ యాత్రలో భాగంగా కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వినాయకచవితి సందర్భంగా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెంలో వినాయక పూజలో పాల్గొన్నారు. జిల్లా నియోజకవర్గం
హైదరాబాద్: ఆత్మగౌరవ యాత్రలో భాగంగా కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వినాయకచవితి సందర్భంగా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెంలో వినాయక పూజలో పాల్గొన్నారు. జిల్లా నియోజకవర్గం ఇన్ చార్జి దేవినేని ఉమా ఉమామహేశ్వర రావు సహా పలువురు పార్టీ నాయకులు పూజల్లో పాల్గొన్నారు.
కాగా, సమైక్య శంఖారావం పేరుతో బస్సు యాత్ర చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సోదరి వైయస్ షర్మిల నెల్లూరు జిల్లా కావలిలో వినాయక పూజలు చేశారు. వినాయక పర్వదినం సందర్భంగా ఆమె తన యాత్రకు సోమవారం విరామం ఇచ్చారు. ఆమె తన యాత్రను తిరిగి మంగళవారం ప్రారంభిస్తారు. మంగళవారం ఆమె యాత్ర ప్రకాశం జిల్లాలోకి చేరుకుంటుంది.

వినాయక చవితి సందర్భంగా సికింద్రాబాద్‌లోని వినాయక దేవాలయంలో మాజీ మంత్రి శంకరావు ప్రత్యేక పూజలు జరిపారు. తమ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా ఆరోగ్యం కుదుట పడాలని, రాహుల్ గాంధీ ప్రధాని కావాలని దేవుడిని వేడుకున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఇందిరాగాంధీ జన్మదినం నవంబర్ 19 లేదా డిసెంబర్ 9 లోపు తెలంగాణ ప్రక్రియ పూర్తవుతుందని ఆయన అన్నారు. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమే అని, హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయరని శంకరావ్రు అన్నారు.
వినాయక చవితి పండుగ సందర్భంగా చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో చవితి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. వరసిద్ధ వినాయకుడికి ప్రభుత్వం తరపున మంత్రి గల్లా అరుణ కుమారి పట్టువస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ - రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వినాయకుడిని వేడకున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications