'నెలలో జగన్‌పార్టీ 3ప్రకటనలు: వర్షాన్ని ఆపే అనిల్‌కి..'

సువార్త సభల్లో కురిసే వర్షాన్ని కూడా ఆపానని చెప్పుకొంటున్న అనిల్ రాష్ట్ర విభజనను ఆపలేరా అని ఆయన ప్రశ్నించారు. ఒక నెలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మూడు నిర్ణయాలు ప్రకటించిందన్నారు. ఆర్టికల్ బి ప్రకారం రాష్ట్ర విభజన చేయాలని ఒకసారి, రెండు ప్రాంతాలకు సమన్యాయం అని మరోసారి, సమైక్యాంధ్ర అంటూ ఇంకోసారి ఇలా మూడు రకాలుగా మాట్లాడారన్నారు.
చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధిని శ్రీకృష్ణ కమిటీ గుర్తిస్తే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అవినీతిని ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్(ఈడి) గుర్తించిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పైన అనవసర విమర్శలు మానుకోవాలని హితవు పలికారు.
రాహుల్ కోసం కాదు: బాలరాజు
రాష్ట్ర విభజన తమ పార్టీ నాయకులు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు కాదని మంత్రి బాలరాజు వేరుగా అన్నారు. రాహుల్ కోరుకుంటే ఇప్పుడే ప్రధాని కాగలరన్నారు. సీమాంధ్రలో ప్రజలు స్వచ్చంధంగా ఉద్యమిస్తున్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications