టిపై చాలాసార్లు చెప్పాం: కాంగ్రెస్, సిఎం ఐనా...: శ్రీధర్

Telangana
న్యూఢిల్లీ/కరీంనగర్: తెలంగాణ అంశంపై గతంలోనే తమ పార్టీ పలుమార్లు అభిప్రాయాన్ని వెల్లడించిందని కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి ఎం అఫ్జల్ బుధవారం న్యూఢిల్లీలో చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు లేవన్నారు. తద్వారా విభజనపై కాంగ్రెసు పార్టీ వెనక్కి తగ్గేది లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

డిగ్గీకి సీమాంధ్ర కాంగ్రెసు ఎంపీల లేఖ

రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్‌కు సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు బుధవారం లేఖ రాశారు. ఎపిఎన్జీవోల సభ తర్వాత దాడుల ఘటనను సీమాంధ్ర నేతలు డిగ్గీ దృష్టికి తీసుకువచ్చారు. హైదరాబాద్‌లో సీమాంధ్రులను రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి చేయి దాటిపోడానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలే కారణమని, వెంటనే చర్యలు తీసుకోవాలని ఎంపీలు వినతి చేశారు.

నేనైనా, సిఎం అయినా..: శ్రీధర్ బాబు

తెలంగాణపై మాటల వరకు ప్రేమ చూపిన పార్టీలు ఇప్పుడు చేతల వరకు వచ్చేసరికి ఉద్యమాలు చేస్తున్నాయని మంత్రి శ్రీధర్ బాబు కరీంనగర్ జిల్లాలో అన్నారు. విభజనపై తాను అయినా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అయినా తమ పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే అన్నారు. అన్ని పార్టీలను సంప్రదించిన తర్వాతనే విభజనపై కాంగ్రెసు పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు.

సిఎస్‌ను కలిసిన టి ఉద్యోగులు

తెలంగాణ ఉద్యోగులు హైదరాబాదులో సిఎస్‌ను కలిశారు. సీమాంధ్రలో ఉన్న తెలంగాణ ఉద్యోగులకు తగిన రక్షణ కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా దేవి ప్రసాద్ మాట్లాడుతూ.. ఎపిఎన్జీవోలు సమ్మెను విరమించి విభజనకు సహకరించాలని కోరారు. సమైక్యాంధ్ర కోసమంటూ ఉద్యమిస్తున్న ఉద్యోగులను లోనికి రానీయవద్దని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సమ్మెలో ఉన్నా పలువురు ఉద్యోగులు ప్రభుత్వ వాహనాలను ఉపయోగిస్తున్నారని, వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+