కోర్టులో జగన్ బెయిల్ పిటిషన్: సుప్రీం ఆదేశాల మేరకు

తాను సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నానని, సిబిఐ తీరు తన స్వేచ్ఛను హరించే విధంగా ఉందని, తాను ఏడాదికి పైగా జైలులో ఉంటున్నానని జగన్ తన బెయిల్ పిటిషన్‌లో పేర్కొన్నారు.
కాగా, జగన్ ఆస్తుల కేసులో సిబిఐ వరుసగా ఛార్జీషీట్సు దాఖలు చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో జగన్ పలుమార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నప్పటికీ ఆయనకు చుక్కెదురయింది. జగన్ బెయిల్ కోసం సుప్రీం కోర్టు వరకు వెళ్లారు. ఆఖరుసారి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు సుప్రీం కోర్టు సిబిఐకి ఈ నెల 8వ తేదీలోగా తుది ఛార్జీషీట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఆ తర్వాత బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చునని తెలిపింది.
ఈ మేరకు ఈ నెల 8వ తేదీలోగా సిబిఐ తుది ఛార్జీషీటు దాఖలు చేయలేదు. మంగళవారం మరో మూడు ఛార్జీషీట్స్ దాఖలు చేసింది. తుది ఛార్జీషీట్ మాత్రం దాఖలు చేయలేదు. దీంతో, జగన్ ఈ రోజు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ రేపు ఏం కౌంటర్ దాఖలు చేయనుందనేది చర్చనీయాంశమైంది.












Click it and Unblock the Notifications