పైనుంచి దూకి టెక్కీ ఆత్మహత్య: పాతబస్తీలో కాల్పులు

మూసాపేట పరిధిలోని కేతలాపూర్‌లో ఇటీవల కొనుగోలు చేసిన ఫ్లాట్ చూసి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. అక్కడికి వెళ్లిన అతను ఆపార్టుమెంట్ భవనం 19వ అంతస్థు నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని అతను లేఖలో చెప్పాడు. మృతుడికి భార్య రీనా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో ప్రాంతంలో జహానుమా వద్ద కాల్పులు జరిగినట్లు సమాచారం ఈ సంఘటనలో కరీం అనే వ్యక్తికి గాయలైనట్లు తెలుస్తోంది. ఓ వ్యక్తి తన బంధువులపైకి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. కరీంముల్లా ఖాన్ రియల్ ఎస్టేట్ వ్యాపారి అని తెలుస్తోంది. అతనిపైకి ఇర్ఫాన్, అహ్మద్ కాల్పులు జరిపినట్లు వార్తలు వచ్చాయి.
దంపతుల దారుణ హత్య
నెల్లూరు జిల్లాలోని తండ మండలంలో గల తండకండ్రిక పంచాయతీ బోడిలింగాలపాడు గ్రామంలో బుధవారంనాడు రెండు మధ్య చిన్న వివాదం భార్యాభర్తల హత్యకు దారి తీసింది. గ్రామంలోని చిన్నస్వామి గేదెలను తోట బాబు అనే వ్యక్తి ప్రతి రోజూ మేపడానికి తీసుకుని వెళ్లేవాడు. బుధవారం తోటబాబు చిన్న మునస్వామి కత్తితో తోటబాబు ఇంట్లోకి వెళ్లి తోటబాబును, అతని భార్య రాణమ్మను దారుణంగా నరికి చంపాడు. చిన్న మునస్వామి పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications