టిపై అవాస్తవాలేలా?: షిండేకు విజయమ్మ ప్రశ్నల వర్షం

అఖిల పక్ష భేటీ సమయంలో తమ పార్టీ చెప్పిన వైఖరిని షిండే వక్రీకరించడం దురదృష్టకరమన్నారు. విభజనపై తమ వైఖరిని అనేకసార్లు చెప్పామన్నారు. రెండు ప్రాంతాలకు న్యాయం జరిగేలా ఓ తండ్రిలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పామన్నారు. గతంలో జరిగిన రెండు అఖిల పక్ష సమావేశాల్లోను తాము ఇదే చెప్పామన్నారు.
అలాంటప్పుడు తాము తెలంగాణకు అనుకూలంగా చెప్పామని ఎలా అంటున్నారని ప్రశ్నించారు. ప్రధానికి రాసిన లేఖను కూడా తాము జతచేస్తున్నట్లు చెప్పారు. షిండే వాస్తవాలను మరుగుపరుస్తున్నారని చెప్పారు. సిపిఎం మినహా మిగిలిన పార్టీలు తెలంగాణకు సానుకూలంగా అఖిల పక్షంలో చెప్పాయన్న వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు.
బిజెపి, తెరాస, టిడిపి, సిపిఐలు తెలంగాణకు అనుకూలంగా చెప్పాయని, సిపిఎం, మజ్లిస్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు విభేదించాయన్నారు. అలాంటప్పుడు ఐదు పార్టీలు అనుకూలంగా చెప్పాయని ఎలా అంటున్నారన్నారు. ఉన్నత పదవిలో ఉన్న మీరు అవాస్తవాలు మాట్లడటం ఎంత వరకు సమంజసమన్నారు.
ఒక ప్రాంతానికి న్యాయం చేయమంటే మరో ప్రాంతానికి అన్యాయం చేయమని చెప్పడం కాదన్నారు. ఇరు ప్రాంతాలకు న్యాయం కావాలన్నారు. విభజన నిర్ణయంతో కోస్తా, సీమాంధ్ర ప్రాంతాలు అట్టుడుకుతున్నాయన్నారు. నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు.
రాష్ట్రం కలిసుంటేనే నీళ్లు రావడం లేదని, విడిపోతే పోలవరం ప్రాజెక్టుకు నీళ్లు ఎక్కడి నుండి వస్తాయని ప్రశ్నించారు. తాము మొదటి నుండి వ్యతిరేకిస్తున్నామన్నారు. ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విడగొట్టడం సరికాదన్నారు. 43 రోజులుగా సీమాంధ్రలో ప్రజలు రోడ్ల పైకి వచ్చారన్నారు. వారికి ఉద్యోగులు ఎక్కడి నుండి ఇస్తారన్నారు.












Click it and Unblock the Notifications