వైయస్సే భయపడేవాడు: జగన్ పార్టీ వారిపై చండ్ర నిప్పు

తనను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు అడ్డుకోవడంతో వారిపై మండిపడ్డారు. 'మీ నాయకుడు జైల్లో ఉన్నాడు. పిచ్చపిచ్చగా మాట్లాడితే మీ అంతు చూస్తాం. బీకేర్ ఫుల్. మేం తలుచుకుంటే. తరిమితరిమి కొడతాం. మీ నాయకుడు రాష్ట్రాన్ని లూటీ చేశాడు. దేశాన్ని భ్రష్టుపట్టించాడు. జైలుకు పోయినా సిగ్గులేదు. 1999లో వైయస్ ప్రారంభించిన తెలంగాణ ప్రక్రియను సోనియా ముగించినట్లు దిగ్విజయ్ సింగ్ చెప్పినా మీకు సిగ్గు కూడా లేదు.
రాష్ట్ర విభజనకు ఆర్టికల్-3 ఉపయోగించటం ద్వారా ఏ కత్తితో పొడవాలో కూడా ఈ దొంగల నాయకుడే కాంగ్రెస్‌కు చెప్పాడు. ముందు సమన్యాయం.. తర్వాత సమైక్యవాదం. రేపోమాపో కాంగ్రెస్‌లో విలీనమైపోతారు. కాంగ్రెస్‌తో లాలూచీ పడిన దొంగలు మీరు. మీ పార్టీనా నాకు చెప్పేది? 30 ఏళ్ల టిడిపి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన పార్టీ. ఈ దొంగలు వచ్చి మనల్ని అవమానపరుస్తారా. వీళ్లకు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని ఎవరికైనా అమ్మేస్తారు' అని మండిపడ్డారు.
బుధవారం కృష్ణా జిల్లాలో ఆరో రోజున ఆయన తిరువూరు మండలం వావిలాల గ్రామం వచ్చినప్పుడు కొందరు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు కాన్వాయ్‌కి అడ్డుపడేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకున్నా జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. దీంతో చంద్రబాబు నిప్పులు చెరిగారు. గ్రామంలో సభ అనంతరం మరోసారి కూడా హెచ్చరించారు.
"మిమ్మల్ని ఉరుకులెత్తించేవాళ్లం. దేహశుద్ధి చేస్తేగానీ మీకు బుద్ధి రాదు. పొలంలో ఉన్న రైతుకు నన్ను నిలదీసే హక్కు ఉంది. కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దొంగలకు లేదు. ఖబడ్దార్. మాతో పెట్టుకుంటే తోక కట్ చేసి పంపిస్తా. వైయస్సారే నా దగ్గర భయపడేవాడు.. మీరెంత? రాజమండ్రిలో ఎటిఎం దోచి పాదయాత్రకు ఖర్చు పెట్టారు. నర్సీపట్నంలో దొంగ నోట్లు ముద్రించి ఖర్చు చేశారు. మీరా మాట్లాడేది? ఊరికి ఐదారుగురురు పనికిమాలినవాళ్లుంటారు. వాళ్లకో క్వార్టర్ బాటిల్, బిర్యానీ ప్యాకెట్ ఇస్తే చాలు.. ఆ రోజంతా ఊళ్లో హడావుడి చేసేస్తారు'' అని దుయ్యబట్టారు.












Click it and Unblock the Notifications