గాడిదల్లా..: నారాయణ, తూ.గో.లో జగన్ పార్టీకి టి షాక్

ఇప్పటికే ఒకసారి తెలంగాణ ప్రకటనను అడ్డుకున్నారని, రెండోసారీ అలాంటి పరిస్థితే ముందుకు వస్తోందని, ఇంకా శాంతియుతంగా ఎలా ఉండగలమని ప్రశ్నించారు. తెలంగాణ సాయుధ పోరాటం 66వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్ రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో బుధవారం 'ఆట-పాట-మాట' కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడారు. కమ్యూనిస్టులు ఎదగకుండా ఉండేందుకే బూర్జువా వర్గాలు మొదటి నుంచి యత్నిస్తున్నాయని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు విజయవాడలో కమ్యూనిస్టులు బలంగా ఉన్నారని, ఈ కారణంగానే అక్కడ గాక కర్నూలును రాజధాని చేశారన్నారు. దొంగలకు, దోపిడీదారులకు వీధుల్లో విగ్రహాలు పెట్టే ప్రభుత్వం రావి నారాయణ రెడ్డి విగ్రహం పెట్టడానికి మాత్రం ముందుకు రావడం లేదన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రధాని కానీయరాదన్నారు. ఆయనో కల్లు తాగిన కోతి అని, నిప్పుపై కాలేశాడని, ఇంక ఏమైనా చేయగలడన్నారు.
రాజమండ్రిలో జై తెలంగాణ
రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద బుధవారం జై తెలంగాణ నినాదం వినిపించింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో కొందరు బుధవారం.. సెంట్రల్ జైలులో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు సన్మానం చేద్దామని వెళ్లారు. మొదట డిఐజి నరసింహులును సన్మానించారు. తర్వాత సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ న్యూటన్‌ను సన్మానించారు. అనంతరం బయటకు వస్తున్న ఉద్యోగులను 'జై సమైక్యాంధ్ర' అనాల్సిందిగా కోరారు. కానీ అక్కడ ఉన్న కొందరు తెలంగాణ ప్రాంత ఉద్యోగులు 'జై తెలంగాణ' అని నినదించారు. దీంతో ఇరువర్గాల మధ్య కాసేపు వాదోపవాదాలు జరిగాయి. అధికారులు సర్ది చెప్పారు.












Click it and Unblock the Notifications