ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జనం గోడు పట్టదా..? కేసీఆర్‌పై అర్వింద్ విసుర్లు

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్దం తీవ్రస్థాయికి చేరింది. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ, టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ జరుగుతుంది. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అయితే సీఎం కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు చేస్తారు. ఏ అంశమైనా సరే నిప్పులు చెరుగుతారు. ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. రైతుల ఇబ్బందుల గురించి మాట్లాడారు.

భారీ వర్షాలతో రైతులకు తీవ్రమైన నష్టం జరిగిందని అర్వింద్ అన్నారు. రైతు బీమా కట్టడంలో తెలంగాణ ప్రభుత్వం విపలమైందని మండిపడ్డారు. ఫసల్ యోజనలో చేరితే పరిహారం వచ్చేదని సూచించారు. కావాలనే చేరలేదని మండిపడ్డారు. చేరితే ప్రయోజనం చేకూరేదిగా అని కామెంట్ చేశారు. సీఎం కేసీఆర్ కావాలనే ఇలా చేస్తారని మండిపడ్డారు.

bjp mp arvind slams cm kcr

వరదలో బాధితులను పరామర్శించడంలో సీఎం కేసీఆర్ విఫలమ్యారని అర్వింద్ మండిపడ్డారు. చెవి నొప్పికి, పంటి నొప్పికి పదే పదే ఢిల్లీ వెళ్ళే కేసీఆర్‌కు ఇక్కడి ప్రజల నొప్పి కానరావడం లేదా? అని ప్రశ్నించారు. జనం గోడు పట్టించుకోకపోవడం ఏంటీ అని ఫైరయ్యారు. ఎన్నికల సమయంలోనే కేసీఆర్‌కు ప్రజలు గుర్తుకు వస్తారా అని అడిగారు. ఇటు మంత్రి కేటీఆర్‌పై విమర్శలు చేశారు. కాలు గాయంతో ఉన్న మంత్రి కేటీఅర్ ఏం సినిమాలు చూడాలని అడగటం ఏంటీ అన్నారు. ఇదీ మంచి పద్ధతి కాదని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎన్నికలకు సమయం ఉంది.. అయినప్పటికీ ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొంది. ప్రధాన పార్టీలు ఆ మాదిరిగా క్యాంపెయిన్ చేస్తున్నారు. ఎవరికీ ఎవరూ తగ్గడం లేదు. విమర్శల జడివాన కొనసాగుతోంది. అర్వింద్‌తోపాటు బండి సంజయ్ కూడా అధికార పార్టీపై విరుచుకుపడుతున్నారు.

English summary
bjp mp dharmapuri arvind slams cm kcr
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X