ఏపీలో 1367 కరోనా కేసులు: 14 మంది మృతి
ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. నిన్నటికన్నా కాస్త స్వల్పంగా కేసులు వచ్చాయి. గత 24 గంటల్లో 61,178 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,367 మందికి పాజిటివ్ వచ్చింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 288 కొత్త కేసులు వయ్యాయి. చిత్తూరు జిల్లాలో 217, కృష్ణా జిల్లాలో 155, ప్రకాశం జిల్లాలో 141, నెల్లూరు జిల్లాలో 135, పశ్చిమ గోదావరి జిల్లాలో 126 కేసులు వయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 3 కేసులు గుర్తించారు.
1,248 మంది కరోనా నుంచి కోలుకోగా, 14 మంది మృత్యువాతపడ్డారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 14,044కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,34,786 పాజిటివ్ కేసులు వచ్చాయి. 20,06,034 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 14,708 మందికి చికిత్స జరుగుతోంది.

ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు.
ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు థర్డ్ వేవ్ అని నిపుణులు చెప్పడంతో భయాందోళన నెలకొంది.












Click it and Unblock the Notifications