అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు: 8 మంది మృతి

|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. నిన్నటికన్నా స్వల్పంగా కేసులు పెరిగాయి. గత 24 గంటల్లో 60,350 కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. 1,393 మందికి పాజిటివ్ వచ్చింది. నిన్న 1367 కరోనా కేసులు వచ్చిన సంగతి తెలిసిందే. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 272 కొత్త కేసులు నమోదు కాగా, తూర్పు గోదావరి జిల్లాలో 206, నెల్లూరు జిల్లాలో 201, కృష్ణా జిల్లాలో 162 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 5 కేసులు గుర్తించారు.

Aditi Budhathoki: నేపాలీ బ్యూటీ 'అదితి బుధతోకి'.. హాట్ బికినీ అందాలకు ఫిదా అవ్వాల్సిందే! (ఫోటోలు)Aditi Budhathoki: నేపాలీ బ్యూటీ 'అదితి బుధతోకి'.. హాట్ బికినీ అందాలకు ఫిదా అవ్వాల్సిందే! (ఫోటోలు)

1,296 మంది కరోనా నుంచి కోలుకోగా, 8 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,36,179 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,07,330 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 14,797 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,052కి పెరిగింది.

1393 people infected corona in andhra pradesh

ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు.

ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు థర్డ్ వేవ్ అని నిపుణులు చెప్పడంతో భయాందోళన నెలకొంది.

English summary
last 24 hours 1393 people infect corona in andhra pradesh state. 8 people died due to corona virus health officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X