అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ 2 లక్షల మంది ఇందుకే ఫెయిల్ అయి ఉంటారు.. కారణం చెప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి

|
Google Oneindia TeluguNews

ఏపీలో పదో తరగతి ఫలితాల ప్రకటనపై సందేహాం తలెత్తింది. 2 లక్షల మంది ఫెయిల్ అవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై ప్రభుత్వం సమాధానం ఇచ్చినా.. విపక్షాలు మాత్రం తగ్గడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. టెన్త్ క్లాస్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చోటుచేసుకుండా కఠిన చర్యలు తీసుకున్నామని, ఉత్తీర్ణత శాతం తగ్గడానికి అది కూడా ఓ కారణం అయ్యుంటుందని అన్నారు.

పారదర్శకంగా..

పారదర్శకంగా..


పరీక్షలు పారదర్శకంగా జరిపామా, లేదా అన్నది తమకు ముఖ్యమని ఉద్ఘాటించారు. ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం కూడా ఉత్తీర్ణత శాతంపై ప్రభావం చూపి ఉంటుందని సజ్జల అభిప్రాయపడ్డారు. ఆంగ్ల మాధ్యమం తొలిసారి ప్రవేశపెట్టినందున కొన్ని ఇబ్బందులు సహజమేనని, అందువల్ల కూడా ఉత్తీర్ణత శాతం తగ్గి ఉంటుందని వివరించారు.

రెండేళ్లు నో..

రెండేళ్లు నో..


కరోనా సంక్షోభం వల్ల గత రెండేళ్లుగా విద్యాసంస్థలు సరిగా నడవలేదని, విద్యార్థుల్లో పోటీతత్వం తగ్గి ఉంటుందని తాము భావిస్తున్నామని వివరించారు. విమర్శలను తాము పట్టించుకోబోమని సజ్జల స్పష్టం చేశారు. గతంలో 90 శాతం మంది పాస్ అయితే, అంతమంది ఎలా పాస్ అయ్యారంటూ విమర్శించేవారని, ఆ విధంగా విమర్శలు చేసిన వారు ఇప్పుడు మాట్లాడాలని అన్నారు.

విపక్షాల అనుమనాలు..

విపక్షాల అనుమనాలు..


ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలకు సంబంధించి విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. 2 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ కావడం వారి సందేహాలకు బలం చేకూరుస్తోంది. ఇదే విషయాన్ని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రస్తావించారు. ఫలితాలు ప్రభుత్వ వైఫల్యమేనని ఆరోపించారు. ఇంత మంది విద్యార్థులు ఫెయిల్ కావడం ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

English summary
2 lakh students are failed due to this reason:sajjala
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X