ఏపీలో 415 కరోనా కేసులు..: ఆరుగురు మృతి
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 415 కరోనా కేసులు వచ్చాయి. వైరస్ సోకిన ఆరుగురు మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 20,64,287కు కరోనా కేసులు చేరాయి. దీంతో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 14,356 మందికి చేరింది. ప్రస్తుతం ఏపీలో 4,655 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా వైరస్ నుంచి 20,45,276 మంది రికవరీ అయ్యారు. కరోనా వైరస్‌తో గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. 3 జిల్లాల్లో ఆరుగురు చనిపోయారు.
ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. వైరస్‌ను జయించేందుకు రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. దీనిపై ప్రకటన రాలేదు.

ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు డిసెంబర్ వరకు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. జనవరి నుంచి ఏప్రిల్ వరకు థర్డ్ వేవ్ ఇంపాక్ట్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు. దానిని దాటేస్తే గానీ.. పరిస్థితి ఏంటో చెప్పలేమని ఒకవిధంగా వార్నింగ్ ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications