ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: 500 లోపే కేసులు

తెలుగు రాష్ట్రాల్లో కరోనా అదుపులోకి వచ్చింది. రోజువారీ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో 434 కొత్త కరోనా కేసులు వచ్చాయి. ఇటు కరోనా మరణాల సంఖ్య కూడా భారీగా తగ్గింది. కరోనా సోకిన ఒకరు చనిపోయారు. చిత్తూరు జిల్లాలో ఒక కరోనా మరణం సంభవించింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 4వేల 636 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో 15వేల 193 కరోనా టెస్టులు చేశారు. ఇవాళ్టి వరకు రాష్ట్రంలో 3,28,46,978 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశారు.

రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,13,212 ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 22,83,788గా ఉంది. రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14 వేల 698 కాగా.. రాష్ట్రంలో ప్రస్తుతం 14వేల 726 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆదివారం 749 కేసులు, 3 మరణాలతో పోలిస్తే సోమవారం కరోనా కేసులు, మరణాల సంఖ్య భారీగా తగ్గడం ఊరటనిచ్చే అంశం.

 434 people infected coronavirus in andhra pradesh

కొంతకాలంగా కొత్త కేసులు, పాజిటివిటీ రేటు దేశవ్యాప్తంగా తగ్గుతుండటంతో మహమ్మారి వ్యాప్తి అదుపులోకి వస్తున్నట్లే కన్పిస్తోంది. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 10.67లక్షల మందికి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 34వేల 113 మందికి పాజిటివ్‌గా తేలింది. క్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసుల సంఖ్య 10వేలకు పైగా తగ్గింది. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు కూడా 3.19శాతానికి దిగొచ్చింది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 75.18 కోట్ల కరోనా టెస్టులు చేశారు. గత 24 గంటల్లో 10,67,908 కోవిడ్ పరీక్షలు జరిగాయి. దేశంలో ప్రస్తుతం 4,78,882 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

కోవిడ్ మరణాలు కూడా సగానికి తగ్గడం ఊరటనిచ్చే అంశం. క్రితం రోజు 680కి పైనే మరణాలు నమోదవ్వగా.. తాజాగా ఆ సంఖ్య 346కు తగ్గింది. దేశంలోకి కరోనా వ్యాప్తి మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు 5,09,011 మందిని బలితీసుకుంది. ఇక గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 91,930 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 97.68శాతానికి పెరిగింది. కొత్త కేసులు తగ్గుముఖం పట్టడంతో దేశంలో యాక్టివ్ కేసులు తగ్గుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,78,882 మంది వైరస్‌తో బాధపడుతుండగా.. యాక్టివ్‌ కేసుల రేటు 1.12శాతానికి తగ్గింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+