అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కోనసీమ అల్లర్లు: 46 మందిపై కేసు నమోదు.. ఈ సెక్షన్ల కింద...

|
Google Oneindia TeluguNews

కోన‌సీమ అల్లర్లకు సంబంధించి పోలీసులు పురోగతి సాధించారు. మొత్తం 46 మందిని గుర్తించారు. ఆ 46 మందిపై పలు సెక్లన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.మ‌రింత మందిపైనా కేసులు న‌మోదు చేసే దిశ‌గా పోలీసులు కసరత్తు చేస్తున్నారు. బీజేపీ కోన‌సీమ జిల్లా కార్య‌ద‌ర్శి సుబ్బారావు, అదే పార్టీకి చెందిన నేత రాంబాబు, కాపు ఉద్య‌మ నేత న‌ల్లా సూర్య‌చంద‌ర్ రావు కుమారుడు అజ‌య్ ఉన్నారు.

 46 members name filed fir in the konaseema riots

ఆందోళనకారులపై 307, 143, 144, 147, 148, 151, 152, 332, 336, 427, 188, 353 r/w 149 IPC, 3, 4 PDPPA, 32 PA-1861 సెక్షన్ల కింద కేసు నమోదు.చేశారు. సామర్లకోటకి చెందిన వాసంశెట్టి సుబ్రహ్మణ్యం ఫిర్యాదుపై కేసు.. వజ్ర వెహికల్ లో గత రెండేళ్లుగా హోంగార్డుగా సుబ్రహ్మణ్యం పని చేస్తున్నారు. కాపు ఉద్యమ నేత నల్లా సూర్యచంద్రరావు కుమారుడు నల్లా అజయ్‌పై కేసు కట్టారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా సుబ్బారావుపై కేసు.. కోనసీమలో విధ్వంసంపై మరో మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు సమాచారం.

నాగబాబు, నూకల పండు, కురసాల నాయుడు, థింక్ యాడ్ సావుకారు, దున్నల దిలీప్, అడప శివ, అసెట్టి గుడ్డు, చిక్కల మధుబాబు, దువ్వ నరేశ్, లింగోలు సతీశ్, నల్ల నాయుడు, నక్క హరి, కిశోర్, దొమ్మేటి బబ్లూ, నల్ల పృథ్థి, మోకా సుబ్బారావు, ఐళ్ల నాగ వెంకట దుర్గా నాయుడు, అడప సత్తిబాబు, నల్ల రాంబాబు, యెళ్ల రాధ, గాలిదేవర నరసింహ మూర్తి, సమసాని రమేశ్, కడలి విజయ్, తోట గణెశ్, అన్యం సాయి, దూలం సునీల్, కలవకొలను సతీశ్, కనిపుడి రమేశ్, ఎదరపల్లి జంబు, చింతపల్లి చిన్నా, పొలిశెట్టి కిశోర్, నల్ల కరుణ, పాటి శ్రీను, చిక్కం బాలాజీ, పెద్దిరెడ్డి రాజా, మడిశెట్టి ప్రసాద్, వినయ్(కలవకొలను స్ట్రీట్), శివ, సదనాల మురళి, నల్ల అజయ్, వాకపల్లి మణికంఠ, కసిన పణీంద్ర, కొండేటి ఈశ్వర రావ్, అరిగెల తేజ, అరిగెల వెంకట రామారావు, రాయుడు స్వామి.

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా అమ‌లాపురం కేంద్రంగా కోన‌సీమ జిల్లాను రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ జిల్లా పేరును అంబేద్క‌ర్ జిల్లాగా మార్చాలని ద‌ళిత సంఘాలు డిమాండ్ చేశాయి.

English summary
46 members name filed fir in the konaseema riots police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X