ఏపీలో 6 వేల లోపు కేసులు.. 11 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు 6 వేల లోపు వచ్చాయి. గత 24 గంటల్లో 5,983 మందికి పాజిటివ్ వచ్చింది. వైరస్ సోకి గత 24 గంటల్లో 11 మంది మృతి చెందారు. రాష్ర్టంలో ప్రస్తుతం 1,00,622 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 22,86,566కి చేరింది. కరోనా బారిన పడి రాష్ట్రంలో ఇప్పటివరకు 14,631 మంది చనిపోయారు. కరోనాతో విశాఖ జిల్లాలో నలుగురు, కడప జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. చిత్తూరు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, ప.గో జిల్లాలో ఒకరు చొప్పున మరణించారు.

తూర్పుగోదావరి జిల్లాలో 741, గుంటూరు జిల్లాలో కొత్తగా 738 కరోనా కేసులు వచ్చాయి. అనంతపురం 488, చిత్తూరు 462, కడప 608, కృష్ణ 618, కర్నూలు 579, నెల్లూరు 304, ప్రకాశం 293, శ్రీకాకుళం 87, విశాఖపట్నం 388, విజయనగరం 112, పశ్చిమ గోదావరిలో 565 చొప్పున నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 11,280 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 21,73,313కి చేరింది. గత 24 గంటల్లో 35,040 మంది శాంపిల్స్‌ను పరీక్షించగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 3,24,40,787కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో 1,00,622 మంది చికిత్స పొందుతున్నారు.

5983 coronacases found at andhra pradesh

దేశంలో కొత్తగా 1,61,386 కరోనా కేసులు వచ్చాయి. రికవరీ అంతకు మించే ఉన్నాయి. గత 24 గంటల్లో కరోనా నుంచి 2,81,109 మంది కోలుకున్నారు. ఒక్కరోజే 1,733 మంది కరోనాతో మరణించారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 16,21,603 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అత్యధికంగా కేరళలో 51,887, తమిళనాడులో 16,096, మహారాష్ట్రలో 14,372, కర్ణాటకలో 14,366, గుజరాత్ లో 8,338 కేసులు వచ్చాయి.

దేశంలో ఒమిక్రాన్ సాముహిక వ్యాప్తి దశకు చేరుకుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. కానీ ఇంతలోనే డ్రాగన్ మరో స్టేట్ మెంట్ ఇచ్చింది. కొత్త వైరస్ వేరియంట్ గురించి చెప్పి.. ఆందోళన కలుగజేసింది. యూరప్‌లో కూడా ఈ ఏడాది చివరి వరకు కరోనా వైరస్ అంతం అవుతుందని ప్రకటన చేసింది.

ఇటు వ్యాక్సిన్ తీసుకున్న వారి జోలికి ఒమిక్రాన్ రాబోదని.. అందుకే నిపుణులు కచ్చితంగా తగ్గుముఖం పడుతుందని చెబుతున్నారు. వైరస్ తగ్గుముఖం పడుతున్న.. జాగ్రత్తతో ఉండాలని కోరింది. మిగతా వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ మాత్రం వేగంగా వ్యాప్తి చెందింది. అందరినీ ఒకసారి పలకరించింది మరీ వెళ్తుంది. అలా రాజకీయ నేతలు కూడా వైరస్ బారిన పడతున్నారు. వారంత వృద్దులే కావడం కాస్త ఆందోళనకు గురిచేస్తోంది. రికవరీ రేటు కూడా ఎక్కువే ఉండటం ఊరట కలిగించే అంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+