ఇక 75 శాతం హాజరు తప్పనిసరి.. అలా అయితేనే ఆ స్కీం: ఏపీ సర్కార్
పేద, మధ్యతరగతి విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని తీసుకొచ్చిన పథకం అమ్మఒడి. ఈ పథకం కింద ప్రతి విద్యార్థికి రూ. 15,000 ఆర్ధిక సాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తోంది ప్రభుత్వం. ఈ మొత్తం నగదు విద్యార్థి తల్లి ఖాతాలో జమ అవుతోంది. ఈ పథకానికి సంబందించిన విధివిధానాలను మొదట్లోనే తెలిపింది. తెల్లరేషన్ కార్డుతోపాటు 75 శాతం హాజరు ఉన్న విద్యార్థులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తోంది. ఇప్పటివరకు హాజరుపై దృష్టిసారించలేదు. కరోనా వల్ల పాఠశాలలు మూతపడటంతో హాజరు శాతాన్ని పక్కన పెట్టి.. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసింది.
ఇప్పటి నుంచి 75 శాతం హాజరు ఉన్న విద్యార్థులకు మాత్రమే అమ్మ ఒడి నగదు జమచేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పాఠశాలల నిర్వహణ, అమ్మఒడి, విద్యాకానుక వంటి అంశాలపై విద్యాశాఖ ఉన్నతాధికారులతో సీఎం జగన్ చర్చించారు. 2024 నాటికి విద్యార్థులు సీబీఎస్‌ఈ పరీక్షలు రాసే దిశగా ముందుకు సాగాలని కోరారు. ఎయిడెడ్ స్కూళ్లను విలీనం విషయంలో బలవంతం చేయట్లేదనే విషయాన్నీ స్వష్టంగా చెప్పాలని కోరారు. ఎయిడెడ్ యాజమాన్యాలు అప్పగిస్తే ప్రభుత్వమే పాఠశాలలను నడుపుతుందని తెలిపారు.

1వ తరగతి నుంచి ఇంటర్ చదివే విద్యార్థుల తల్లులకు అమ్మఒడి పథకం కింద రూ.15 వేల ఆర్థిక సాయం అందిస్తారు. కోవిడ్-19 కారణంగా విద్యార్థులు 75శాతం హాజరు నిబంధనను మినహాయించారు. ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో చదువుతున్న తల్లుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తారు. 2019-20 విద్యా సంవత్సరానికి పదో తరగతి చదివి, ఇంటర్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ పొందని విద్యార్థులు కూడా అమ్మ ఒడి పథకానికి అర్హులేనని ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది. ఐటీఐ, పాలిటెక్నిక్, ట్రిపుల్ ఐటీ కోర్సులు ఎంచుకున్న పదో తరగతి విద్యార్థులకు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు అమలు చేస్తున్నందున అమ్మ ఒడి వర్తించదని ఉత్తుర్వుల్లో తెలిపారు.












Click it and Unblock the Notifications