13 వేలకు పైగా కేసులు.. 94 మంది మృతి.. ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఇంపాక్ట్ కొనసాగుతోంది. రోజుకు 10 వేల పైన కేసులు వస్తున్నాయి. గతంలో కన్నా కేసులు తగ్గినా.. మొత్తం మీద మాత్రం ఎక్కువగానే ఉన్నాయి. అసలే సెకండ్ వేవ్ కావడంతో కాస్త భయాందోళన వ్యక్తమవుతోంది. గత 24 గంటల్లో 13 వేల పైచిలుకు పాజిటివ్ కేసులు వచ్చాయి. అయితే రికవరీ రేటు కూడా ఎక్కువగానే ఉండటం కాస్త సానుకూల అంశంగా మారింది.
గత 24 గంటల్లో ఏపీలో కొత్తగా 13,400 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసలు 16,85,142కి కరోనా కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో 94 మంది మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా వల్ల 10,832 మంది చనిపోయారు. ప్రస్తుతం ఏపీలో 1,65,795 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి ఇప్పటివరకు 15,08,515 మంది రికవరీ అయ్యారు.

కరోనా వైరస్‌తో చిత్తూరు 14, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో 9 మంది చొప్పున మృతి చెందారు. అనంతపురం, తూర్పుగోదావరి జిల్లా, శ్రీకాకుళం, విశాఖలో 8 మంది చొప్పున మృతి చెందారు. కృష్ణా 6, విజయనగరం 6, కర్నూలు, నెల్లూరులో ఐదుగురు చొప్పున మృతి చెందారు. గుంటూరు, కడప జిల్లాల్లో నలుగురు చొప్పున కరోనాతో మృతి చెందారు.
వేసవిలోనే వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. అక్టోబర్‌లో థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. సరయిన వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేవరకు జనానికి ఇబ్బందులు తప్పవు.












Click it and Unblock the Notifications