అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వామ్మో.. ఇదేంది, అమ్మవారికి కోపమా.. అందుకే శాపమా.. గుమిగూడి మరీ పూజలు

|
Google Oneindia TeluguNews

కరోనా కన్నెర్ర చేస్తోంది. దీంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. సరైన చికిత్స తీసుకొని.. ఇంటిపట్టునే ఉంటున్నారు. అయితే కొన్నిచోట్ల మూడనమ్మకాలను మాత్రం వీడటం లేదు. కరోనా వచ్చి ఇంతమంది చనిపోవడానికి కారణం.. అమ్మవారి ఆగ్రహమే అంటున్నారు. వీరి చేష్టలను చూసి నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు. కానీ కొంచెం జాలి మాత్రం వేస్తోంది. ఈ ఘటన ఏపీలో జరిగింది.

గుమిగూడిన జనం..

గుమిగూడిన జనం..

కరోనా సెకండ్ వేవ్ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. తూర్పు గోదావరి జిల్లా మామిడాడలో కూడా అలాంటి పరిస్థితే.. దీంతో వారు తమ గ్రామ దేవత గోగులమ్మ ఆగ్రహాం వ్యక్తం చేసిందని అనుకున్నారు. కరోనా కేసులు పెరుగుతున్నందున లాక్ డౌన్ కూడా అమల్లో ఉంది. అయినా ఆదివారం అందరూ గుమిగూడి.. పూజలు నిర్వహించారు. అమ్మవారు శాంతించాలని కోరుకున్నారు.

మాస్క్ కూడా లేదు

మాస్క్ కూడా లేదు


అమ్మవారి వద్ద పూజలు చేసే సమయంలో భౌతికదూరం లేనేలేదు. మరికొందరు అయితే మాస్క్ కూడా ధరించలేదు. అక్కడికి చేరుకున్న పోలీసులు జనసమూహన్ని పంపించివేశారని ఎస్పీ తెలిపారు. పూజ నిర్వహించిన నిర్వహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. డిజాస్టర్ మేనెజ్ మెంట్ యాక్ట్.. తదితర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Recommended Video

Yellow Fungus Cases Reported In UP | Oneindia Telugu
20.48 పాజిటివ్ రేట్

20.48 పాజిటివ్ రేట్


ఏపీలో కరోనా కేసులు ఎక్కువగానే ఉన్నాయి. ఆదివారం 18 వేల 767 కేసులు వచ్చాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 2 లక్షల 9 వేల 237కి చేరింది. తూర్పుగోదావరి జిల్లాలోనే 2887 కేసులు వచ్చాయి. ఆదివారం 104 మంది చనిపోగా.. మొత్తం మృతుల సంఖ్య 10 వేల 126కి చేరింది. పాజిటివ్ రేటు 20.48గా ఉంది.

English summary
Covid protocols went for a toss in Andhra Pradesh’s East Godavari district on Sunday as hundreds of devotees participated in a gathering at the Gogulamma Thalli Temple in G. Mamidada village.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X