ఏపీ అసెంబ్లీ సెషన్: సెప్టెంబర్ మూడో వారంలో నిర్వహణ..? జగన్ కేసు నేపథ్యంలో

అసెంబ్లీ సమావేశాలకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు అయ్యింది. సెప్టెంబర్ మూడో వారం నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని విశ్వసనీయంగా తెలిసింది. వర్షాకాల సమావేశాలను సాధ్యమైనన్ని ఎక్కువ రోజులు నిర్వహిచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం అందింది. సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ఈడీ కోర్టు విచారణ ప్రారంభిస్తోన్న సంగతి తెలిసిందే.

జగన్ కేసు తెరపైకి వస్తోన్న క్రమంలో ఏపీలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించడం పొలిటికల్ హీట్‌ను పెంచింది. కరోనా వైరస్ వల్ల బడ్జెట్ సమావేశాలు మూడు రోజులకే పరిమితం అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను ఎక్కువ రోజులు నిర్వహించాలని భావిస్తున్నారు. ప్రజా సమస్యలపై చర్చిస్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ విపక్షం సహకరిస్తోందా.. సభను సజావుగా సాగనీస్తోందో చూడాలీ మరీ.

 ap assembly meetings in third week of september

వారం నుంచి పది రోజులపాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. థర్డ్‌వేవ్‌ ప్రభావాన్ని బట్టి వచ్చే వారంలో చర్చించి ఈ సమావేశాల ప్రారంభ తేదీని, పని దినాలను ఖరారు చేసే అవకాశముందని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. కొవిడ్‌ కారణంగా బడ్జెట్‌ సమావేశాలు పూర్తి స్థాయిలో జరగలేదు. అయితే వర్షాకాల సమావేశాలను వీలైనంత ఎక్కువ రోజులు జరపాలనే అభిప్రాయంలో ప్రభుత్వం ఉంది.

ఏపీలో మరోసారి నైట్ కర్ఫ్యూ పొడిగింపు కేంద్రం సూచించిన సవరణలను పూర్తిచేసి 'దిశ' బిల్లును మరోసారి అసెంబ్లీ ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఈ సమావేశాల్లో మండలి ఛైర్మన్‌, డిప్యూటీ ఛైర్మన్ల స్థానాలకు ఎన్నికలను నిర్వహించే విషయంపై కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. మే నెలలో ఛైర్మన్‌, జూన్‌లో డిప్యూటీ ఛైర్మన్‌ పదవి ఖాళీ అయిన సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+