ఏపీ డీఎస్సీ 2 వారాలు వాయిదా.. అభ్యర్థుల వినతి మేరకు ప్రభుత్వ నిర్ణయం
అమరావతి : ఏపీ డీస్సీ పరీక్షలు 2 వారాల పాటు వాయిదాపడ్డాయి. దీనికి సంబంధించి మంత్రి గంటా శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. డీఎస్సీ రాయబోయే అభ్యర్థుల వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. డీఎస్సీ ప్రకటనకు, ఎగ్జామ్ కు మధ్య గ్యాప్ తక్కువగా ఉండటంతో చదువుకోవడానికి సమయం కావాలంటూ అభ్యర్థులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై సీఎం చంద్రబాబుతో చర్చించి డీఎస్సీ పరీక్షను 2 వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు మంత్రి గంటా శ్రీనివాసరావు.
తొలి షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 6న డీఎస్సీ ఎగ్జామ్ జరగాల్సి ఉంది. అయితే రెండు వారాల పాటు వాయిదా వేయడంతో కొత్త షెడ్యూల్ ఇంకా ఖరారు చేయలేదు. బుధవారం నాడు ఆ వివరాలు ప్రకటించే ఛాన్సుంది. 7,729 పోస్టులకు గాను 6 లక్షల 8వేల 157 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. డీఎస్సీ పరీక్ష ఆఫ్‌లైన్ లేదంటే ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారా అనే విషయం తేలలేదు. దీనిపై ఉన్నతాధికారులు చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.













Click it and Unblock the Notifications