Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

AP budget sessions 2023: అమరావతి పరిధిలో మోడల్ పట్టణాలు..!!

అన్ని వర్గాల సంక్షేమంతో పాటు సమగ్రాభివృద్ధే తమ లక్ష్యమని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.

అన్ని వర్గాల సంక్షేమంతో పాటు సమగ్రాభివృద్ధే తమ లక్ష్యమని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. 2023-24 ఆర్థిక ఏడాదికి మొత్తం రూ.2 లక్షల 79వేల 279 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ శాసనసభలో ప్రవేశ పెట్టారు. విధాన పరమైన ఆవిష్కరణలు, వినూత్న పాలనా విధానాలు మా ప్రభుత్వం విశిష్ట లక్షణాలగా బుగ్గన పేర్కొన్నారు. 2030 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు నవరత్నాలు, మేనిఫెస్టోలో పెట్టిన పథకాల ఆధారంగా రూపొందించిన అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఒక సమ్మిళిత విధానాన్ని మా ప్రభుత్వం అవలంభించిందని చెప్పుకొచ్చారు. సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూనే అభివృద్ధికి తీసుకుంటున్న నిర్ణయాలను బుగ్గన తన ప్రసంగంలో వివరించారు.

బడ్జెట్ ప్రసంగంలో బుగ్గన ఈ నాలుగేళ్ల కాలంలో ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించారు. 15004 గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు, 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల నియామకం. 2.65 లక్షల మంది వాలంటీర్ల నియామకం. 51,488 మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ పరిధిలోకి తీసుకువచ్చామని చెప్పారు. అదే సమయంలో అమరావతి పరిధిలోని తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాలను మోడల్ పట్టణాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు. ఇప్పటికే ఈ నిర్ణయం అమలు దిశగా ప్రభుత్వం నిర్ణయించింది. రూ. రూ.1,173 కోట్లతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా.. తొలిదశలో భాగంగా రూ. 20 కోట్లను పురపాలిక శాఖ మంజూరు చేస్తూ ఆదేశాలను జారీ చేసింది. కాగా, సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక రూపకల్పన బాధ్యతలను ఆంధ్రప్రదేశ్‌ అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌కు అప్పగించింది. ఇప్పుడు బుగ్గన బడ్జెట్ ప్రసంగంలో ఈ అంశాన్ని ప్రస్తావన ద్వారా మరింత ప్రాధాన్యత పెరిగింది.

AP Finance minister Buggana mention on Mangalagiri and Tadepalli as model towns in his budget speech

రాష్ట్రంలో మౌళిక వసతుల కల్పనకు ఇస్తున్న ప్రాధాన్యతను మంత్రి బుగ్గన వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్‌ 31, 2022 వరకు, 13 పెద్ద, భారీ ప్రాజెక్ట్‌లు 15,099 కోట్ల రూపాయల పెట్టుబడి, 12,490 మందికి ఉపాధిని కల్పించి వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించాయన్నారు. అదే విధంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ) రంగంలో 7,742 కోట్ల రూపాయల పెట్టుబడితో 54,430 యూనిట్లు 2,11,219 మందికి ఉపాధి కల్పనతో ఉత్పత్తిలోకి ప్రవేశించాయని బుగ్గన వివరించారు. డిసెంబర్ 2022 వరకు, పారిశ్రామిక ప్రోత్సాహకాల క్రింద జనరల్ కేటగిరీలోని 902 సూక్ష్మ చిన్న మరియు మధ్యతరహా (ఎం.ఎస్.ఎం.ఈ.) యూనిట్లకు, ఇతర వెనుకబడిన తరగతులకు చెందిన 448 యూనిట్లకు, షెడ్యూలు కులాలకు చెందిన 3,748 యూనిట్లకు షెడ్యూలు తెగలకు చెందిన 602 యూనిట్లకు మొత్తం 482 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని చెప్పుకొచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+