వైసిపి రాజగురువు వద్దకు బాలకృష్ణ అల్లుడు : ఎన్నికల వేళ హాట్ టాపిక్..!
వైసిపికి రాజగురువు ఆయన. వైసిపి ఏపి చేయాలన్నా..ఏ కార్యక్రమం ప్రారంభించాలన్నా ఆయనే ముహూర్తం ఖరారు చేస్తారు. ఆ రాజగురువు వద్దకు బాలకృష్ణ అల్లుడు..విశాఖ టిడిపి ఎంపి అభ్యర్ది భరత్ వెళ్లారు. తరచూ ఆయన సీయం చంద్రబాబు తీరు పై ఓపెన్ గానే విమర్శలు చేస్తారు. అయితే, ఎన్నకల వేళ ఇప్పుడు భరత్ వెళ్లి కలవటం.. ఆయన తో సమావేశం అవ్వటం చర్చనీయాంశంగా మారింది.
వైసిపి వెన్ను దన్నుగా ఆయనే..
వైసిపి అధినేత జగన్ ప్రతిపక్ష నేత అయిన తరువాత విశాఖ లోని శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామిని తరచూ కలుస్తున్నారు. ఆయన ఆశీస్సులు తీసుకుంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి సైతం ఎన్నికల సమయంలో స్వామి ని సంప్రదించారు. కేసీఆర్ విజయం కోసం స్వరూపానంద స్వామి రాజ శ్యామల యాగం నిర్వహించారు. ఎన్నికల్లో గెలి చిన తరువాత కేసీఆర్ విశాఖ వచ్చి ఆశ్రమాన్ని సందర్శించారు. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఇక, వైసిపి నేత లు జగన్ తో సహా విజయ సాయి రెడ్డి సైతం తరచూ ఈ స్వామి వద్దకు వెళ్తున్నారు. ఇక, స్వరూపానంద అనేక సంద ర్భాల్లో ముఖ్యమంత్రి తీరు మీద విమర్శలు చేసారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అక్రమాల పైన కోర్టును ఆశ్రయిస్తానని చెప్పుకొచ్చారు. ఈ విషయం రాజకీయంగా చర్చకు కారణమైంది. ఇక, తాజాగా వైసిపి నుండి పోటీ చేసే అభ్యర్దుల జాబితా విడుదల సమయంలోనూ వైసిపి నేతలు స్వరూపానంద ను సంప్రదించారు. ఆయన సూచించిన ముహూర్తం ప్రకారమే నడుచుకుంటున్నారు.

స్వామీజీ తో భరత్ భేటీ..
వాస్తవంగా ఈ నెల 16వ తేదీన ఉదయం 10.26 గంటలకు వైసిపి జాబితా విడుదల చేయాలని స్వామిజీ ముహూర్తం ని ర్ణయించారు. అయితే వైయస్ వివేకా మృతి కారణంగా ఆ ముహూర్తం వాయిదా పడింది. ఇక, 16 వ తేదీ రాత్రి స్వామిజీ మరో ముహూర్తం నిర్ణయించారు. ఆయన సూచనలకు అనుగుణంగా అదే రోజు రాత్రి వైసిపి నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 9 మంది అభ్యర్దులను ప్రకటించారు. ఆ సమయంలో వేమిరెడ్డి తాము స్వరూపానంద నిర్ణయించిన ముహూర్తం ప్రకారమే అభ్యర్దులను ప్రకటిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఇక, ఇప్పుడు వైసిపికి రాజగురువుగా భావిస్తున్న ఈ
శ్రీశారదాపీఠాధిపతి స్వరూపానందస్వామిని విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి, బాలకృష్ణ అల్లుడు ఎం.భరత్ కలిశారు. రాజ శ్యామల అమ్మవారిని దర్శించి స్వరూపానంద స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. అయితే, వైసిపి కి అండగా నిలుస్తు న్నారనే ప్రచారంలో ఉన్న ఈ స్వామిజీని ఇప్పుడు టిడిపి అభ్యర్ది..బాలకృష్ణ అల్లుడు కలవటం చర్చ నీయాంశంగా మారింది. దీని పై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications