AP undavalli arun kumar ysrcp ys jgan chandrababu naidu andhra pradesh amaravati vijayawada jagan padayatra ycp tdp chandra babu jagan padayatra ఏపి వైసిపి టిడిపి చంద్రబాబు
జగన్ నాడు పాడు చేసుకున్నారు..ఇప్పుడు : చంద్రబాబుది పోరాడే తత్వం..! ఉండవల్లి జోస్యం..
ఏపిలో ఢీ అంటే ఢీ అంటున్న ఇద్దరు నేతల గురించి మాజీ ఎంపి ఉండవల్లి ఆసక్తి కర విశ్లేషణ చేసారు. జగన్ గత ఎన్నిల్లోనే అధికారంలోకి రావాల్సి ఉన్నా..పాడు చేసుకున్నారు. చంద్రబాబు ఓడిపోతున్నా..పోరాడే తత్వం ఉన్న వ్యక్తి అని విశ్లేషించారుద. అయితే, చివరి నిమిషం దాకా చూడాల్సిందేనన్నారు..

జగన్ అప్పుడు పాడు చేసుకున్నారు..మరో నేతకు రాలేదు..
ఏపిలో రాజకీయాల పైనా..ముఖ్యమంత్రి..విపక్ష నేత రాజకీయల మీద మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ పలు కీలక అంశాల పైఆ విశ్లేషణ చేసారు. వైసిపి అధినేత జగన్ పాదయాత్రకు వస్తున్న స్పందన చూస్తుంటే..దేశంలో మరే నేతకు ఇంతగా రాలేదని అభిప్రాయపడ్డారు. జగన్ కు వస్తున్న జనం..వారు చూపుతున్న స్పందన అద్బుతంగా ఉంద ని చెప్పుకొచ్చారు.
జగన్ సైతం ప్రజలను బాగానే కమ్యూనికేట్ చేయగలుగుతున్నారని పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లోనే జగన్ అధికారంలోకి రావాల్సి ఉందని..అయితే కొంత పాడు చేసుకున్నారని వివరించారు. వైయస్ఆర్ కుమారుడు కావటం జగన్ కు పెద్ద ప్లస్ పాయింట్ అని విశ్లేషించారు. వైయస్ మరణం తరువాత ప్రజలు దేవుడిగా భావించారని చెబుతూ..ఆయన కుమారుడగా జగన్ ను ప్రజలు ఆదరించారని వివరించారు. జగన్ పై గతంలోనూ ఉండవల్లి తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వివరించారు.
పవన్ కు చంద్రబాబు ట్రాప్ : కన్వీన్స్ ఆర్ కన్ఫ్యూజ్ : జనసేనాని లొంగేనా..!

ఇంత నెగటివ్ ఎప్పుడూ చూడలేదు..
ఏపిలో ప్రస్తుతం చంద్రబాబుకు ఉన్నంత నెగిటివ్ గతంలో తానెప్పుడూ చూడలేదని ఉండవల్లి చెబుతున్నారు. ఏపి లో జరుగుతున్న అక్రమాల పై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నారు. క్షేత్ర స్థాయిలో విచ్చల విడిగా అవినీతి కనిపిస్తోందని దీని పై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని వివరించారు. ఇక, అన్నా క్యాంటీన్లలోనూ అధిక ధరలకు విక్రయాలు సాగుతు న్నాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి విడుదల చేస్తున్న శ్వేత పత్రాలతో అంతా అభివృద్ది అయినట్లు చెబుతూ.. మరో వైపు కేంద్రం ఏమీ చేయలేదని చెప్పటం తో రెండిటి మధ్య లింకు కుదరటం లేదనే అభిప్రాయ వ్యక్తం చేసారు. ఏపి ప్రభుత్వం ప్రకటించిన శ్వేత పత్రాల పై చర్చ జరగాలని సూచించారు.

చంద్రబాబు ఓడిపోతున్నా..పోరాడేతత్వం..
ఏపిలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పోటీ గురించి విశ్లేషించిన ఉండవల్లి ముఖ్యమంత్రి పోరాట పటిమ గురించి ఆసక్తి కర కామంట్లు చేసారు. జగన్ కు జనం బ్రహ్మరధం పడుతున్నారని..
జగన్ సైతం ప్రజలతో బాగా ఇంటరాక్ట్ అవుతున్నారని చెబుతూనే..వచ్చే ఎన్నికల్లో ఏం జరుగుతుందో చివరి నిమిషం దాకా చెప్పలేమన్నారు. ఎందుకంటే జగన్ కు జన స్పందన ఉన్నా..చంద్రబాబును చివరి నిమషం దాకా చూడాల్సిందేనన్నారు. చంద్రబాబు ఓడిపోతున్నా.. పోరాడే తత్వం ఉన్న వ్యక్తి అంటూ ఉండవల్లి విశ్లేషించారు. చంద్రబాబు ను దుర్యోధనుడు వంటి వాడని పేర్కొన్న ఉండవల్లి.. ఎన్నికల సమయంలో ఎవరితో అయినా కలవగలిన నేర్పరి అని వివరించారు.