నిజమైన అంబేద్కర్ వాది జగన్, లిప్ట్ కూడా ఎక్కనీయడం లేదు: మంత్రి రోజా వర్సెస్ వర్ల

ఇవాళ అంబేద్కర్ జయంతి.. ఊరు, వాడల్లో దళిత మేధావి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నేతలు కూడా అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అంబేద్కర్ జయంతి రోజున ఏపీలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్దం జరిగింది. దళితులకు పదవులపై వర్ల రామయ్య అటాక్ చేయగా.. మంత్రి రోజా కౌంటర్ అటాక్ చేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా తన చాంబర్‌లో ఆయన చిత్రపటానికి రోజా నివాళులు అర్పించారు.

నిజమైన అంబేద్కర్ వాది జగన్..

నిజమైన అంబేద్కర్ వాది జగన్..


దేశంలో అన్ని మతాలు, కులాలు, వర్గాలు, ప్రాంతాలకు చెందినవారు కలిసిమెలిసి జీవించడానికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం దోహదపడుతోందని మంత్రి రోజా వివరించారు. అంబేద్కర్ ఏ ఒక్క కులానికో, ఏ ఒక్క వర్గానికో చెందినవారు కాదని, ఆయన దేశం మొత్తానికి చెందిన వ్యక్తి అని పేర్కొన్నారు. బలహీనవర్గాలు బాగుండాలని, సమ సమాజం ఏర్పడాలని ఆకాంక్షించిన వ్యక్తి అంబేద్కర్ అని పేర్కొన్నారు. నిజమైన అంబేద్కర్ వాది అంటే సీఎం జగనే అని చెప్పారు. అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకుని, ఆయన కోరుకున్న సమసమాజాన్ని స్థాపించిన ఏకైక సీఎం జగన్ అన్నారు.

బడుగులకు ప్రయారిటీ

బడుగులకు ప్రయారిటీ

క్యాబినెట్ నుంచి గ్రామస్థాయిలో వలంటీర్ వ్యవస్థ వరకు చూస్తే.... బడుగు బలహీన, దళిత, మైనారిటీ వర్గాలకు, మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నారని గుర్తుచేశారు.
ఇటీవలి క్యాబినెట్ కూర్పులో 70 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అవకాశం ఇచ్చారని గుర్తుచేశారు. అట్టడుగు వర్గాల వారిని కూడా సమంగా గౌరవిస్తూ, వారికి అన్ని విధాలుగా అవకాశాలు కల్పిస్తూ అభివృద్ధి దిశగా నడిపిస్తామో అదే అంబేద్కర్‌కు నిజమైన నివాళి అని రోజా అన్నారు.

లిప్ట్ కూడా ఎక్కనీవడం లేదట

లిప్ట్ కూడా ఎక్కనీవడం లేదట


మంత్రి రోజా ఇలా అన్నారో లేదో.. టీడీపీ సీనియ‌ర్ నేత వ‌ర్ల రామ‌య్య కౌంటర్ ఇచ్చారు. సీఎం జ‌గ‌న్‌పై విమర్శలు గుప్పించారు. బ‌ల‌హీన వర్గాల‌కు పెద్ద పీట వేస్తున్నామ‌ని చెబుతున్న జ‌గ‌న్‌... ద‌ళితుల‌ను క‌నీసం త‌న వెంట లిఫ్ట్ కూడా ఎక్క‌నివ్వ‌డం లేదని వ‌ర్ల రామ‌య్య కామెంట్ చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని రాష్ట్రంలో ద‌ళితుల‌పై జ‌రుగుతున్న దాడులు, అవ‌మానాల‌పై వ‌ర్ల రామ‌య్య కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ద‌ళితుల ఓట్ల‌తో ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన జ‌గ‌న్‌.. ఇప్పుడు ద‌ళితుల‌పై దాడులు చేయిస్తున్నార‌ని వ‌ర్ల రామయ్య ఆరోపించారు. అంట‌రానిత‌నాన్ని పాటించే జ‌గ‌న్‌కు ద‌ళితుల‌ను అక్కున చేర్చుకునే చంద్ర‌బాబుతో పోలికా? అంటూ వ‌ర్ల రామయ్య ప్ర‌శ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+