పనితీరు సరిగా లేకుంటే చర్యలు, షోకాజు నోటీసులు: సీఎం జగన్ వార్నింగ్
గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిపై ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ సీరియస్ అయ్యారు. అధికారుల పనితీరు సరిగా లేదని స్పందన కార్యక్రమంలో కామెంట్ చేశారు. పనిచేయని వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాలను ఓన్ చేసుకోవాలని సూచించారు. వీటి సమర్థత మెరుగుపడాలంటే పర్యవేక్షణ జరగాలని తెలిపారు.
కలెక్టర్లు, జేసీలు, మున్సిపల్ కమిషనర్లు, ఐటీడీఏ పీవోలు, సబ్ కలెక్టర్లు గ్రామ, వార్డు సచివాలయాలను పర్యవేక్షణ చేయాలని సూచించారు. వచ్చే స్పందన కార్యక్రమం వరకు నిర్ధేశించిన విధంగా వంద శాతం గ్రామ, వార్డు సచివాలయాలను పర్యవేక్షించాలని కోరారు. విధులు సమర్థవంతంగా నిర్వహించని వారికి మెమోలు ఇవ్వాలని స్పష్టంచేశారు.

ఇన్ స్పెక్షన్ చేయకపోతే సమస్యలు ఎలా తెలుస్తాయని జగన్ ప్రశ్నించారు. బియ్యం కార్డు, పెన్షన్ కార్డు, ఇళ్ల పట్టాలు, ఆరోగ్యశ్రీ అర్హులందరికీ అందాలని పేర్కొన్నారు. ఆగస్టు 10న నేతన్న హస్తం, 16న విద్యా కానుక ప్రారంభిస్తామని తెలిపారు. రూ.20 వేల లోపు డిపాజిట్ చేసిన అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు ఇస్తామని స్పష్టంచేశారు. పెద్ద అమౌంట్ వారికి కాస్త సమయం పడుతుందని వివరించారు. అందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. వారి డబ్బులను అన పైసాతో సహా చెల్లిస్తామని పేర్కొన్నారు.
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందజేయడంలో కీ రోల్ పోషిస్తున్నారు. పెన్షన్, ఇతర సంక్షేమ పథకాల కోసం జనం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా జగన్ చేశారు. అయితే వారి పనితీరుపై నివేదికలు రావడంతో.. ఆయన కాస్త అసహనం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications