ఏపీలో కరోనా కల్లోలం.. 11 వేలకు పైగా కేసులు.. రెండురోజుల కన్నా తక్కువే
ఏపీలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. నిన్న, మొన్నటితో పోలిస్తే.. తక్కువ కేసులు వచ్చాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 11,573 కరోనా కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 22,60,181కి చేరాయి. కరోనాతో ముగ్గురు మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనా వల్ల 14,594 మంది మృతి చెందారు. ఏపీలో 1,15,425 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి కోలుకుని 21,30,162 మంది రికవరీ అయ్యారు.
Recommended Video
కరోనా విజృంభిస్తున్న వేళ జిల్లాలో కరోనా పరీక్షలు, వైద్యం ప్రైవేటుగా విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఆర్‌టీపీసీఆర్ పరీక్షల ఫలితాలు తక్షణం రాని పరిస్థితుల్లో వాటి కోసం రెండో రోజు వరకూ వేచి ఉండలేని వారు మాత్రం ర్యాపిడ్ టెస్టులకే మొగ్గు చూపుతున్నారు. ర్యాపిడ్ టెస్టుల్లో పాజిటివ్ వచ్చిన వారు కొందరు సాంకేతికంగా నిర్ధారణ జరిగే ఆర్‌టీసీపీఆర్ పరీక్షలకు వెళుతున్నా.. మెజారిటీ సంఖ్యలో మాత్రం ప్రైవేటు వైద్యాన్నే ఆశ్రయిస్తున్నారు.

దేశంలో ఒమిక్రాన్ సాముహిక వ్యాప్తి దశకు చేరుకుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. కానీ ఇంతలోనే డ్రాగన్ మరో స్టేట్ మెంట్ ఇచ్చింది. కొత్త వైరస్ వేరియంట్ గురించి చెప్పి.. ఆందోళన కలుగజేసింది. మరోవైపు జనవరి వరకు కరోనా పూర్తిగా తగ్గుముఖం పడుతుందనే వార్తలు ఊరట కలిగిస్తున్నాయి. యూరప్‌లో కూడా ఈ ఏడాది చివరి వరకు కరోనా వైరస్ అంతం అవుతుందని ప్రకటన చేసింది.
ఇటు వ్యాక్సిన్ తీసుకున్న వారి జోలికి ఒమిక్రాన్ రాబోదని.. అందుకే నిపుణులు కచ్చితంగా తగ్గుముఖం పడుతుందని చెబుతున్నారు. వైరస్ తగ్గుముఖం పడుతున్న.. జాగ్రత్తతో ఉండాలని కోరింది. మిగతా వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ మాత్రం వేగంగా వ్యాప్తి చెందింది. అందరినీ ఒకసారి పలకరించింది మరీ వెళ్తుంది. అలా రాజకీయ నేతలు కూడా వైరస్ బారిన పడతున్నారు. వారంత వృద్దులే కావడం కాస్త ఆందోళనకు గురిచేస్తోంది. రికవరీ రేటు కూడా ఎక్కువే ఉండటం ఊరట కలిగించే అంశంగా మారింది.












Click it and Unblock the Notifications